ఆ సీక్వెల్ అటకెక్కినట్టేనా..?
బడ్జెట్ ఎక్కువైన ప్రతి సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది
బడ్జెట్ ఎక్కువైన ప్రతి సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది. కథను ఒక సినిమాగా చెప్పలేం అనుకున్నప్పుడు రెండు భాగాలుగా చెప్పొచ్చు.. ఆడియన్స్ లో ఆ ఎగ్జైట్ మెంట్ కొనసాగించ వచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి కూడా ఆ ప్రాజెక్ట్ ని ఒక సినిమాగానే చేయాలని అనుకున్నాడు. కానీ పాత్రలు బాగా వస్తుండటంతో ఆ కాన్ఫిడెన్స్ తో ఎవరు చేయలేని సాహసం చేశాడు. రాజమౌళి వేసిన ఆ ఒక్క అడుగు ఎన్నో సినిమాలకు స్పూర్తిగా నిలిచింది. ఎంతోమంది దర్శకులకు ధైర్యం ఇచ్చింది.
ఐతే అన్ని సినిమాలు ఇలా రెండు భాగాలుగా చెప్పాలనుకుంటే పొరపాటు చేసినట్టే. బాహుబలి సినిమాకు అలా కుదిరింది. ఆ తర్వాత వచ్చిన కె.జి.ఎఫ్ కూడా రెండు భాగాలు అలా వర్క్ అవుట్ అయ్యింది. మరోపక్క పుష్ప ని కూడా అలా రెండు భాగాలుగా తెస్తున్నారు. అయితే ఈ మధ్యలో కొన్ని సినిమాలు అలాంటి ప్రయత్నమే చేసినా అంతగా వర్క్ అవుట్ కాలేదు.
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈగల్. ఈ సినిమా రిలీజ్ ముందు ఒక భాగంగానే అనుకోగా సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. అసలు కథ సెకండ్ పార్ట్ లోనే అనిపించేలా చేశారు. అయితే ఈగల్ సినిమా సక్సెస్ అయితే ఈగల్ 2 చేసే అవకాశం ఉండేది. కానీ ఈగల్ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఈగల్ 2 చేసే ఛాన్స్ ఉందా అంటే కష్టమే అని అంటున్నారు. ఈగల్ 1 నే ఎవరు చూడలేదు. ఈగల్ 2 చేస్తే మాత్రం ఉపయోగం ఉంటుందా అని దర్శక నిర్మాతల్లో డౌట్ మొదలైంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈగల్ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టేశారు. ఈగల్ 2 కి సంబంధించిన కొంత రష్ ఉన్నా సీక్వెల్ చేయాలంటే మళ్లీ ఎంతోకొంత సెటప్ చేయాల్సి ఉంటుంది. అందుకే రవితేజతో ఈగల్ 2 చేయడం కన్నా దానికి బదులు మరో సినిమా చేయడం బెటర్ అనే ఆలోచన కూడా మంచిదని చెప్పొచ్చు. డైరెక్టర్ కార్తీక్ మాత్రం ఈగల్ ని వదిలి పెట్టి తేజా సజ్జాతో మిరాయ్ అంటూ వస్తున్నాడు. లేటెస్ట్ గా ఆ సినిమా నుంచి మంచు విష్ణు టీజర్ రిలీజ్ చేశారు. మిరాయ్ లో విలన్ గా మంచు విష్ణు అదరగొట్టనున్నాడని చెప్పొచ్చు.