ఈగల్ ట్రైలర్.. మాస్ రాజా విధ్వంసం

ఇప్పటికే విడుదలైన టీజర్ మువీపై అంచనాలను భారీగా పెంచేయగా.. తాజాగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Update: 2023-12-20 11:52 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ ఈగల్ మూవీతో రాబోతున్న విషయం తెలిసిందే. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మువీపై అంచనాలను భారీగా పెంచేయగా.. తాజాగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


ట్రైలర్ లో రవితేజ లుక్, మాస్ యాక్షన్ సీన్లు మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. తుపాకీ నుంచి వచ్చే బులెట్ ఆగదేప్పుడో తెలుసా.. అది పట్టుకున్నవాడిని తాకినప్పుడే అంటూ నవదీప్ అనుపమకు చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అనుపమకు నవదీప్ ఫ్యాష్ బ్యాక్ చెబుతున్నట్లు చూపించారు మేకర్స్. హీరో మారణ హామాన్ని ఆమెకు వివరించాడు నవదీప్.

విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసం ఆపే వినాశనం నేను అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అదిరిపోాయింది. కావ్య తాపర్ తో రవితేజ కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తుర్కియే, జపాన్, జర్మనీలో ట్రాన్సక్షన్లు జరుపుతున్న రవితేజను పట్టుకోవాలని విలన్లు ట్రై చేస్తుంటారు.

ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచి వాడు కాదంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతూ ఫైట్ చేస్తుండగా ట్రైలర్ ముగిసింది. అసలు రవితేజ ఎవరనేది క్లారిటీగా చూపించలేదు. కానీ ట్రైలర్ చాలా ఇంట్రైస్టింగ్ ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతోపాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది.

వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ప్రస్తుతం సాలిట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది మొదట్లో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ లో అలరించిన రవితేజ ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అవి నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆయన ఈగల్ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News