డెనిమ్ షార్ట్ లో అందాల ఈషా

తెలుగు అమ్మాయి అయినప్పటికీ, తన అందంతోనూ, టాలెంట్ తోనూ ఆమె తమిళం సహా ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది.

Update: 2024-10-16 11:53 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే నటి ఈషా రెబ్బా, తాజాగా షేర్ చేసిన ఫోటోలు మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాయి. "Me and my warm mirror vibes" అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో ఈషా సింపుల్ టీషర్ట్, డెనిమ్ షార్ట్ ధరించి, తన ఫిట్‌నెస్ పై కృషిని స్పష్టంగా చూపిస్తున్నారు.

 

 

ఆ మధ్య జిమ్ లో వర్కౌట్స్ చేసిన తర్వాత తీసిన కొన్ని ఫొటోలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఫోటోలలో ఆమె ముఖంపై చెమట కనబడటం, ఫిట్ గా ఉండేందుకు ఆమె ఎంత కష్టపడుతున్నారో చెప్పకనే చెబుతోంది. ఇక ఇప్పుడు అమ్మడు మరోసారి ఆ రేంజ్ లో లెగ్స్ అందాలతో షాక్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. ఈషా తన అందంతో పాటు ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎంతో కసరత్తులు చేస్తోంది.

 

తెలుగు అమ్మాయి అయినప్పటికీ, తన అందంతోనూ, టాలెంట్ తోనూ ఆమె తమిళం సహా ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. వెబ్ సిరీస్ లలో నటిస్తూ కొత్త అవెన్యూస్ ను అన్వేషిస్తోంది. అయితే మంచి కాంటెంట్ ఉన్న క్యారెక్టర్ దొరికితే గ్లామరస్ పాత్రలు చేయడానికి ఇబ్బంది లేదని అమ్మడు గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఫొటోలతో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది.

 

ఈషా ఆమధ్య "దయా" అనే వెబ్ సిరీస్ లో డీ గ్లామర్ లుక్ లో కనిపించి ప్రశంసలు అందుకుంది. అందులో నిండు గర్భిణిగా నటించి, తన నటనలో ఉన్న వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈషా రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానులను మరింత దగ్గరగా చేసుకుంటుంది. ఈ సారి న్యూ లుక్ లో ఆమె సింప్లిసిటీతో పాటు, ఫిట్‌నెస్ పై ఉన్న ప్రేమను కూడా మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News