ఆ బోల్డ్ సీక్వెల్ ఎలాంటి ప్ర‌కంప‌న‌లు రేపుతుందో!

ఏక్తాక‌పూర్-శోభాక‌పూర్-దిబాక‌ర్ బెన‌ర్జీ త్ర‌యం `ల‌వ్ సె*క్స్ ఔర్ దోఖా-2` ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-04-01 14:30 GMT

ఏక్తాక‌పూర్-శోభాక‌పూర్-దిబాక‌ర్ బెన‌ర్జీ త్ర‌యం `ల‌వ్ సె*క్స్ ఔర్ దోఖా-2` ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్లు..ప్ర‌చార చిత్రాలు సినిమాపై అమాతం అంచ‌నాలు రెట్టింపు చేసాయి. తొలి భాగాన్ని మించి రెండ‌వ భాగంలో బోల్డ్ కంటెంట్ మ‌రింత హైలైట్ అవుతుంద‌ని ప్ర‌చార చిత్రాల‌తోనే క‌నిపిస్తుంది. ఈసినిమా రిలీజ్ ఎప్పుడ‌వుతుందా? అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

పరువు హత్య -ఎమ్ ఎమ్ ఎస్ కుంభకోణం మరియు స్టింగ్ ఆపరేషన్‌ల ఆధారంగా ఆద్యంతం బోల్డ్ కంటెంట్ తో సంచ‌ల‌నం సృష్టించిన ప్రాంచైజీ ఇది. ఈ నేప‌థ్యంలో సీక్వెల్ పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుతున్నాయి. దిబాక‌ర్ బెన‌ర్జీ ఈసారి ఎంత‌టి సంచ‌ల‌నం రేపుతాడో చూడాలంటూ అంతా ఎదురు చూస్తున్నారు. ద‌శాబ్ధం క్రిత‌మే సంచ‌ల‌నం రేపిన కంటెంట్ 2024 లో ఇంకెంత అడ్వాన్స్ గా ఉంటుందో? నంటూ ఒక‌టే ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంది. ఇంట‌ర్నెట్ యుగంలో ప్రేమ..కామ కలాపాలు ఎలా ఉంటున్నాయి అన్న అంశం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. మరికొన్ని గంట‌ల్లో రిలీజ్ కానున్న టీజ‌ర్ ఎలా ఉంటుంద‌ని ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ లోనే ఉంది. అనివార్య కార‌ణాల‌తో డిలే అయింది. గ‌త ఏడాదే రిలీజ్ అవుతుంద‌ని భావించారు. అప్ప‌టి నుంచి సినిమా గురించి నెట్టింట ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు సాగాయి. కానీ వాటి గురించి ఏనాడు చిత్ర యూనిట్ ప‌ట్టించుకుంది లేదు. 2010 లో ల‌వ్ సెక్స్ ఔర్ దేక్ష రిలీజ్ అయింది. రెండు కోట్ల‌తో నిర్మాణ‌మైన సినిమా ప‌దికొట్లు వ‌సూళ్తు సాధించింది.

అప్ప‌టి నుంచే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని తెర‌పైకి వ‌చ్చింది. కానీ ఏక్తా క‌పూర్ అండ్ కో వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉండ‌టంతో సాధ్య‌ప‌డ‌లేదు. ప‌దేళ్ల అనంత‌రం మ‌ళ్లీ ఇప్పుడీ సీక్వెల్ ని తెర‌పైకి తెచ్చారు. ఆల‌స్య‌మైనా అదిరిపోయో కంటెంట్ తోనే వ‌స్తున్నారంటూ నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News