నిర్మాతని గౌరవించని హీరో జీవితంలో ఎదగడు!

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే అందరూ ఎక్కువగా హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు.. డైరెక్టర్ గొప్పతనం చెప్తారు

Update: 2024-07-30 09:30 GMT

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే అందరూ ఎక్కువగా హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు.. డైరెక్టర్ గొప్పతనం చెప్తారు.. కానీ సినిమా మొత్తానికి వెన్నుపూసలా నిలబడి ఎంతో కష్టపడ్డా నిర్మాతల గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అలాంటిది ఒక నిర్మాత తన సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అశోక్‌ సెల్వన్, అవంతిక మిశ్రా జంటగా తిరుమలై నిర్మించిన చిత్రం ‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’ ఆడియో, ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత తన సినిమాలో నటించిన హీరో హీరోయిన్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో .. ఆ నిర్మాత ఆవేదన నిజమే కదా అని ఎందరో స్పందిస్తున్నారు. మరి ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..

నిర్మాతను విస్మరించిన ఏ నటుడు కూడా తన కెరీర్ లో ఎదిగిన సందర్భం లేదు అని తిరుమలై పేర్కొన్నారు. టీ క్రియేషన్స్ బ్యానర్ పై తిరుమలై నిర్మాణ సారధ్యంలో అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా జంటగా నిర్మించిన చిత్రం

‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల వేడుకలో నిర్మాత మండలికి చెందిన ముఖ్య నేతలతో పాటు ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కె.సెల్వమణి, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఈ సందర్భంగా తీవ్ర మనస్థాపానికి గురి అయిన నిర్మాత.. చిత్రాన్ని పూర్తి చేయడం కోసం మూడు సంవత్సరాల పాటు హీరో హీరోయిన్లను గాలించి అలసిపోయాను అని పేర్కొన్నారు. హీరోకి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చినప్పటికీ ఆయన సినిమాకి సహకరించలేదని ఈ సందర్భంగా నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు కూడా తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్న ఇలాంటి టైం లో తన సినిమా నటీనటులు మాత్రం ప్రోగ్రాం కి రాకపోవడం పై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.

నిర్మాతలను పట్టించుకోని ఏ నటుడు కూడా పైకి ఎదిగినట్లు చరిత్రలో లేదు అని తిరుమలై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోరీ నచ్చడం వల్ల సినిమా చేయడానికి ఒప్పుకున్న నటుడు.. సినిమా పూర్తి అయిన తర్వాత ప్రమోట్ చేయడానికి ఎందుకు రాలేకపోతున్నాడో తనకు అర్థం కాలేదని అన్నారు.

రెండున్నర గంట సమయం కేటాయించమని రెండున్నర నెలలుగా ప్రాధేయపడుతున్న.. ఇదిగో చెబుతాను అదిగో చెబుతాను అంటూ సెల్వన్ కాలయాపన చేశాడని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు జరిగే ఎటువంటి కార్యక్రమాల్లో హీరోని ఇప్పటివరకు హీరోలను పొగిడిన నిర్మాతలను చూశాను కానీ ఇలా హీరో గురించి మాట్లాడిన నిర్మాతను చూడడం ఇదే మొదటి సారేమో. మరి దీనికి ఆ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags:    

Similar News