యానిమల్‌లో నటించాలన్న OG స్టార్
ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ స్టార్ సందీప్ వంగా 'యానిమల్' ఫ్రాంఛైజీలో భాగం కావాలనుకుంటున్నట్టు బహిరంగంగా తన కోరికను వెలిబుచ్చాడు.
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చాలా కోణాల్లో ఘాటైన విమర్శల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఎంతగా విమర్శలు ఎదురైనా, 1000 కోట్ల క్లబ్‌లో చేరి ప్రాక్టికల్ గా అందరి నోళ్లు మూయించింది. హింస, రక్తపాతం, స్త్రీలపై అఘాయిత్యాలు ఇవన్నీ విమర్శలకు కారణమైనా కానీ సంఘంలోని రియాలిటీని, పచ్చి నిజాల్ని యథాతథంగా తెరపై చూపించడంలో సందీప్ వంగా పెద్ద సక్సెసయ్యాడనేది కాదనలేని నిజం. పాత్రలతో ఇంటెన్సిటీని పీక్స్ కి తీసుకెళ్లే టెక్నిక్ సందీప్ వంగా ప్రత్యేకత.
ఒక హీరోని తెరపై ఎలా ప్రొజెక్ట్ చేయాలి? నటీనటుల నుంచి ఎలాంటి ఔట్ పుట్ తీసుకోవాలి? అనేదాంట్లో సందీప్ వంగా స్పెషలైజేషన్ పై ఇప్పుడు చాలామంది ఔత్సాహిక ఫిలింమేకర్స్ స్టడీ చేస్తున్నారనేది పూణే ఫిలింఇనిస్టిట్యూట్ విద్యార్థి ఒకరు మీడియాకు చెప్పారు. అంతగా ఎవరూ పట్టించుకోని బాబి డియోల్ కి అబ్రార్ పాత్రతో గొప్ప ప్రాముఖ్యతను పెంచాడు. అలాగే ఎవరూ ఊహించని, ఎవరూ గ్రహించని ఒక చిన్న పాత్రలో నటించిన ట్రిప్తి దిమ్రీ కెరీర్ ఓ వెలుగు వెలుగుతోందంటే దానికి కారకుడు సందీప్ వంగా. వీటన్నిటినీ మించి రణబీర్ కపూర్ పాన్ ఇండియన్ కలను నెరవేర్చింది సందీప్ వంగా.
బహుశా అందుకేనేమో.. ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ స్టార్ సందీప్ వంగా 'యానిమల్' ఫ్రాంఛైజీలో భాగం కావాలనుకుంటున్నట్టు బహిరంగంగా తన కోరికను వెలిబుచ్చాడు. ఇన్‌స్టంట్ బాలీవుడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ యానిమల్ పై తన ఆలోచనా విధానాన్ని బహిర్గతం చేసాడు. ఫలానా సినిమాలో నటించాలనుందని అనుకుంటున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఇమ్రాన్ హష్మి మరో మాట లేకుండా యానిమల్ పేరును చెప్పాడు. ఈ సినిమాపై విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ నేను ఆ సినిమా వీక్షిస్తూ నిజంగా ఆనందించాను. అలాంటి సినిమాలో నటించడానికి ఇష్టపడతాను అని వ్యాఖ్యానించాడు హష్మి. ఒక ప్రేక్షకుడిగా వినోదాన్ని ఆస్వాధించానని అన్నాడు. విమర్శలకు కారణాలను అర్థం చేసుకున్నాను.. కాని నేను సాధారణంగా ప్రేక్షకుల దృక్కోణం నుండి సినిమాలను చూస్తాను. కచ్చితంగా ఈ సినిమాలో సందేహాస్పదమైన అంశాలు ఉన్నాయి.. కానీ సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక దృష్టి, పని తీరు గమనించదగినవి.. అని దర్శకుడిని ఆకాశానికెత్తేసాడు.
రొటీనిటీ నుంచి యానిమల్ దూరంగా ఉండటానికి కారణం అందులో బోల్డ్ కంటెంట్.. బోల్డ్ పాత్రలు. అలాంటి బోల్డ్ క్రియేటివ్ రిస్క్‌లను తీసుకున్నందుకు సందీప్ వంగాను ఇమ్రాన్ హష్మి మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. డిఫరెంట్‌గా ధైర్యంగా ఆ పాత్రల్ని చూపించినందుకు దర్శకుడిగా సందీప్ పనితాన్ని మెచ్చుకున్నాడు. యానిమల్ టెంపోలో వైవిధ్యాన్ని ప్రశంసించాడు. నిజానికి హష్మీ యానిమల్ గురించి గొప్పగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో అతడు యానిమల్ లో రణబీర్ కపూర్ పనితీరును ప్రశంసించాడు. ముఖ్యంగా గ్రే షేడ్స్‌తో కూడిన సంక్లిష్టమైన పాత్రను నమ్మశక్యం కాని విధంగా సందీప్ వంగా చిత్రీకరించాడు. అందులో రణబీర్ అద్భుతంగా నటించాడని కొనియాడాడు హష్మి.
హష్మీ చాలా సినిమాలను దృష్టిలో ఉంచుకుని కపూర్ బోయ్ అసాధారణ నటనను పాయింట్ అవుట్ చేసాడు. 'యానిమల్'ని ప్రత్యేకంగా గుర్తుంచుకున్నానని అన్నాడు. అలాంటి ఘాటైన సన్నివేశాల తీవ్రత.. దృఢవిశ్వాసంతో సవాల్ విసిరే పాత్రను పోషించగల సామర్థ్యాన్ని ఇమ్రాన్ హష్మి ప్రశంసించాడు.
పవన్ కల్యాణ్ ఓజీలో ఇమ్రాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీతో తెలుగులో సత్తా చాటాలని ఇమ్రాన్ హష్మి తహతహలాడుతున్నాడు. తెలుగు దర్శకుల పనితనాన్ని అతడు కీర్తిస్తున్నాడంటే ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచన అతడికి ఉంది.