దత్త సాయితో పివి సింధు నిశ్చితార్థం
డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహం జరగనుండగా, డిసెంబర్ 24న హైదరాబాద్ రిసెప్షన్ ప్లాన్ చేసారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. శనివారం బిజినెస్ మేన్ వెంకట దత్త సాయితో ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ అందమైన జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహం జరగనుండగా, డిసెంబర్ 24న హైదరాబాద్ రిసెప్షన్ ప్లాన్ చేసారు. సింధు ఒలింపిక్ గేమ్స్‌లో రజతం, కాంస్యం అలాగే 2019లో ఒక స్వర్ణం సహా ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకున్నారు.
ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. 'మిస్ టు మిసెస్' అనే క్యాప్షన్ ఉన్న బోర్డ్ నేపథ్యంలో ఉంది. ''ప్రేమ మిమ్మల్ని పిలిచినప్పుడు దానిని అనుసరించండి.. ఎందుకంటే ప్రేమ తనకు తప్ప మరొకరికి ఇవ్వదు'' అనే ఖలీల్ జిబ్రాన్ కొటేషన్‌ని పి.వి. సింధు షేర్ చేసారు.
గత నెలలో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్‌లో విజయంతో చాలా కాలంగా వేచి చూస్తున్న టైటిల్ కరువు తీరింది. ఈ విజయం అనంతరం సింధు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సింధుకి కాబోయే భార్య వెంకట పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సింధు- వెంకట జంటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.