ఎంట‌ర్ టైన్ మెంట్ వ‌ర‌ల్డ్ మీడియానే షేక్ చేస్తోంది!

ముఖ్యంగా తెలుగు సినిమాలో వ‌ర‌ల్డ్ వైడ్ గా స‌త్తా చాటుతోన్న వైనం అంత‌కంత‌కు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేస్తుంది.

Update: 2023-11-22 07:18 GMT

ఇండియాలో ఎంట‌ర్ టైన్ మెంట్ అన్న‌ది ఎంత కీల‌కంగా మారింతో చెప్పాల్సిన ప‌నిలేదు. హాలీవుడ్ త‌ర్వాత వ‌ర‌ల్డ్ వైడ్ అంత‌గా ఫేమ‌స్ అయింది భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లే. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. శాండిల్ వుడ్...మాలీవుడ్ అంటూ ఇండియాలో ఉన్న అన్నిర‌కాల ఉడ్ చిత్రాలు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలో వ‌ర‌ల్డ్ వైడ్ గా స‌త్తా చాటుతోన్న వైనం అంత‌కంత‌కు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేస్తుంది.

`బాహుబ‌లి`..`ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలు భార‌తీయ ప‌రిశ్ర‌మ‌కి రెండు క‌ళ్ల‌లా నిలిచాయి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లాంటి న‌టుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ ఉండటం స‌హా ఎన్నో కార‌ణాలు ఇండియాన్ ఇండ‌స్ట్రీని ప‌తాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్సావాల్లోనూ ఏటా భారతీయ ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఎంపిక అవుతోన్న చిత్రాల సంఖ్య వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు ను అంత‌కంత‌కు రెట్టింపు చేస్తుంది.

తాజాగా ప‌నాజీలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ ఇండియా 54వ చ‌ల‌న చిత్రోత్స‌వంలో పాల్గొన్న స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భార‌తీయ ప‌రిశ్ర‌మ‌ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో ప్ర‌పంచంలోనే మూడ‌వ అతి పెద్ద మీడియా ఎంటర్ టైన్ మెంట్ మార్కెట్ గా భార‌త్ అవ‌త‌రించ‌బోతుంద‌న్నారు. `దేశం ఆర్దిక ప‌రంగా ఐద‌వ స్థానంలో ఉంది.

మీడియా...వినోద ప‌రంగా మూడ‌వ స్థానంలో కొన‌సాగుతున్నాం. సినిమా విధానం మారింది. దాన్ని రిలీజ్ చేయానికి కొత్త టెక్నాల‌జీలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఓటీటీ వంటి మాధ్య‌మాలు ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయ సినిమాని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నాయి. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు ప్ర‌ద‌ర్శించ‌డానికి తొలిసారి ఫిల్మ్ బ‌జార్ ని నిర్వ‌హించాం. ఓటీటీ వెబ్ సిరీస్ ల‌కు పుర‌స్కారాలు అంద‌జేయ‌డం సంతోషంగా ఉంది` అన్నారు.

Tags:    

Similar News