హాలీవుడ్ స్టార్లకు మలమూత్రాలు పంపాడు!
వెరోనికా గ్రే ఫిబ్రవరిలో పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని పోస్టాఫీసుల నుండి పొట్లాలను పంపాడు. ప్యాకేజీలలో ఒకటి పగిలిపోవడంతో పోస్టల్ ఉద్యోగికి అసలు విషయం తెలిసింది.
హాలీవుడ్ స్టార్లు లియోనార్డో డి కాప్రియో -జారెడ్ లెటోలకు తన మలమూత్రాలను పంపిన వ్యక్తికి బుధవారం రెండు సంవత్సరాల సత్ప్రవర్తన జైలు విధించడం సంచలనమైంది. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ABC వివరాల ప్రకారం.. వెరోనికా గ్రే అనే మానసిక వికలాంగుడు తన మలం మూత్రాన్ని 23 పోస్టల్ సాచెల్స్‌లో ఉంచి స్టార్లకు పంపాడు. "వాలెంటైన్ కన్ఫెక్షనరీ" అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు.
వెరోనికా గ్రే ఫిబ్రవరిలో పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని పోస్టాఫీసుల నుండి పొట్లాలను పంపాడు. ప్యాకేజీలలో ఒకటి పగిలిపోవడంతో పోస్టల్ ఉద్యోగికి అసలు విషయం తెలిసింది. అనంతరం అతడిని పిలిపించి విచారించారు. 49 ఏళ్ల గ్రే తపాలా సేవకులను బెదిరించడం వేధించడం నేరం చేయడం వంటి పలు తప్పిదాలను అంగీకరించాడని కోర్టు తెలిపింది. బ్రూమ్ పట్టణంలోని న్యాయస్థానంలో అతడిపై విచారణ సాగుతోంది.
గ్రే యునైటెడ్ స్టేట్స్ - ఆస్ట్రేలియాకు ఉపాధికోసం విచ్చేసాడు. ఫిలిప్పీన్స్‌లో జన్మించాడని తెలుస్తోంది. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. గ్రే నిజానికి తారలను వేధించే ఉద్దేశ్యంతో లేడని పర్యావరణంపై తనకు ఉన్న అభిరుచిని షేర్ చేసుకోవాలని కోరుకున్నాడని అతడి తరపు న్యాయవాది వాదించారు.
అయితే కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. అతడికి మానసిక వ్యాధి ఉందని నిర్థారణ అయంది. అది అతడిని నియంత్రిస్తోందని వెల్లడైంది. పోస్టల్ కార్యకలాపాలపై గ్రే లాంటి వారి చెత్త పనులు గణనీయమైన ప్రభావం కలిగిస్తాయని జడ్జి పేర్కొన్నారు.