పిక్ టాక్ : ఓవర్ హీట్ పెంచిన ఫలక్‌నుమా బ్యూటీ

అందమైన హర్షిత గౌర్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తుంది.

Update: 2024-01-01 08:17 GMT

విశ్వక్‌ సేన్‌ తో ఫలక్‌నుమా దాస్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ హర్షిత గౌర్‌. ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో సందడి చేయలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది.


అందమైన హర్షిత గౌర్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఆమె గత ఫోటోలు మరియు వీడియోలు నిరూపించాయి. ఈసారి అంతకు మించిన అందం ఈమెది అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


చీర కట్టిన హర్షిత బ్లౌజ్ ధరించకుండా చాలా అందంగా ఏమాత్రం వల్గర్‌ లేకుండా ఫోటోలో కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫోటోలను చాలా మంది విమర్శిస్తారు. కానీ హర్షిత పిక్స్ కు మాత్రం చాలా మంది వావ్‌ అంటూ కళ్లు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు.

ఇంతటి అందగత్తె అయిన హర్షిత ను ఎందుకు టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోలేదు అంటూ నెటిజన్స్‌ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరి కొన్ని ఫోటో షూట్స్ ను ఈమె వదిలితే తప్పకుండా టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.

Tags:    

Similar News