ఫ్యామిలీ స్టార్ ముగించేది అప్పటికేనా!
ఈ సీన్ తో పాటు మరికొన్ని పెండింగ్ సన్ని వేశాలు షూట్ చేయాల్సి ఉందిట. దీంతో షూటింగ్ మొత్తం ఫిబ్రవరి 20 కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'గీతగోవిందం' తర్వాత ఈ కాంబినేషన్ లో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. టైటిల్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. 'గీతగోవిందం 'రేంజ్ లో పెద్ద హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతికి రిలీజ్ కావాలి.
కానీ షూటింగ్ ఆలస్యమవ్వడంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. అయితే మళ్లీ ఏ తేదికి రిలీజ్ అవుతుంది? అన్నది ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. వేసవి కానుకగా రిలీజ్ అవుతుందని ప్రచారం సాగింది తప్ప ప్రత్యేకించి తేదీ వెలుగులోకి రాలేదు. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ తేదికి రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా చిత్రం 'దేవర' రిలీజ్ వాయిదా పడటంతోనే చిత్ర నిర్మాత దిల్ రాజ్ ఏప్రిల్ 5వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది
చిత్ర బృందం ఇప్పటికే తుది నిర్ణయం కూడా తీసుకుందని..కాకపోతే గోప్యత వహిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ ఎంతవరకూ వచ్చిందంటే? ఇంకా కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 20 కల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర బృందం నుంచి తెలుస్తోన్న సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
విజయ్ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ తో పాటు మరికొన్ని పెండింగ్ సన్ని వేశాలు షూట్ చేయాల్సి ఉందిట. దీంతో షూటింగ్ మొత్తం ఫిబ్రవరి 20 కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మడు 'సీతారా మం'..'హాయ్ నాన్న' విజయాలతో దూసుకుపోతుంది. 'ఫ్యామిలీ స్టార్' రూపంలో భారీ బ్లాక్ బస్టర్ పడితే అమ్మడి కెరీర్ లో తొలి హ్యాట్రిక్ నమోదైనట్లే.