భార్య‌ పార్టీ లైఫ్ న‌చ్చ‌కే ప్ర‌ముఖ గాయ‌కుడి విడాకులు!

జో జోనాస్- సోఫీ టర్నర్ వివాహం చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది.

Update: 2023-09-09 03:15 GMT

జో జోనాస్- సోఫీ టర్నర్ వివాహం చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది. కొన్ని రోజులుగా పుకార్లు వైరల్ కావడంతో ఈ జంట‌ అధికారికంగా విడాకులు ప్రకటించారు. అయితే ఈ బ్రేక‌ప్ కి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి! అంటూ ప్ర‌జ‌ల్లో అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. తాజా నివేదికల ప్రకారం.. ఈ జంట‌ విడాకుల వెనుక కారణం బిడ్డ‌ ప్రసవానంత‌రం సోఫీకి జో జోనాస్ అందుబాటులో లేక‌పోవ‌డ‌మేన‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స‌వానంత‌రం భ‌ర్త త‌న భార్య‌తో స‌రిగా లేడ‌న్న‌ది దీని సారాంశం.

పాపుల‌ర్ TMZ నివేదిక ప్రకారం... సోఫీ టర్నర్ - జో జంట‌కు రెండవ కుమార్తె పుట్టిన తరువాత చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొంది. రెండ‌వ గర్భం తర్వాత సోఫీ ఫోటో తీయడాన్ని లేదా ఈవెంట్‌లకు వెళ్లడాన్ని జో జోనాస్ ఇష్టప‌డ‌లేదు! అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ జోతో కలిసి సోఫీ అనేక ఈవెంట్‌లకు హాజరయ్యింది. కానీ ఆ ఇద్ద‌రినీ ద‌గ్గ‌ర‌గా చూసిన‌ చాలా మంది వ్యక్తులు సోఫీ అసౌకర్యంగా ఉన్నారని, అక్కడ ఉండటానికి ఇష్టపడలేదని స్పష్టం చేశారు. జో జోనాస్, సోఫీ టర్నర్ కాపురంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారని క‌థ‌నాలొచ్చాయి.

సోఫీపై త‌న భ‌ర్త జో MIA (మిస్సిన్ ఇన్ యాక్షన్) అని ఫిర్యాదు చేసాడు. దాంతో ఆమె మరింతగా బయట షికార్లు చేయాల‌ని భావించింది. జో మాటలు విన్న వ్యక్తులకు ఆ ఇద్ద‌రి న‌డుమా తీవ్ర‌మైన ఒత్తిడి ఉందని స్పష్టమైన‌ట్టు చెబుతున్నారు. అయినా జో కొద్దిరోజులుగా త‌న‌కు అండ‌గానే ఉన్నాడ‌ని కూడా ఒక సెక్ష‌న్ పేర్కొంటోంది.

సోఫీ పార్టీల జీవనశైలి

విడాకుల‌కు కార‌ణాల్లో సోఫీ పార్టీ నేచుర్ కూడా ఒక‌టి అంటూ ప్రచార‌మ‌వుతోంది. సోఫీ పార్టీని ఇష్టపడుతుందని కొన్ని వాదనలు తెర‌పైకొచ్చాయి. సోఫీ విపరీతంగా పార్టీలు చేసుకోవడంపై జో కలత చెందాడంటూ ఒక సెక్ష‌న్ ప్ర‌చారం చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. TMZతో మాట్లాడుతూ, జో - సోఫీకి 'విభిన్నమైన జీవనశైలి' ఉందని ఒక అంతర్గత వ్యక్తి చెప్పాడు. జో ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాడు. సోఫీ బయటికి వెళ్లడాన్ని ఆనందిస్తుంది. ఆమె పార్టీని ఇష్టపడుతుంది, అతను ఇంట్లో ఉండటాన్ని ఇష్టపడతాడు. వారు చాలా భిన్నమైన జీవనశైలిని కలిగి ఉన్నారు! అని ప‌లువురు వ్యాఖ్యానించారు.

ఇదే మా విడాకుల ప‌త్రం:

బుధవారం జో జోనాస్-సోఫీ టర్నర్ ఒకేలా క‌నిపించే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో తమ విడాకులను ప్రకటించారు. వారు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ''మా ఇద్దరి నుండి ప్రకటన: నాలుగు అద్భుతమైన సంవత్సరాల వివాహ బంధం తర్వాత మేము దీనిని స్నేహపూర్వకంగా ముగించాలని పరస్పరం నిర్ణయించుకున్నాము. ఎందుకు అనే దానిపై అనేక ఊహాజనిత కథనాలు వ‌స్తున్నాయి. కానీ నిజంగా ఇది ఐక్య నిర్ణయం. మ‌మ్మ‌ల్ని, మా పిల్లల గోప్యతను ప్ర‌తి ఒక్క‌రూ గౌరవిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము..'' అని ఆ లేఖ‌లో రాసారు.

Tags:    

Similar News