తండ్రీ-కొడుకులిద్ద‌రు ఒకే గెట‌ప్ లో

అర్హ ఎంత అందంగా ముస్తాబైందో మాకూ చూపించ‌రంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇట‌లీలో పెళ్లి తంతు ముగియ‌గానే బ‌న్నీ నేరుగా హైద‌రాబాద్ చేరుకుంటారు.

Update: 2023-11-01 06:37 GMT

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహం ఇట‌లీలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ మెగా కుటుంబ స‌భ్యులంతా ముస్తాబైన విధానం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో ఫ్యామిలీ స‌భ్యులంతా మెరిసిపోతున్నారు. పెళ్లికి సంబంధించి ఒక్కో ఫ్యామిలీ ఒక్కో ర‌క‌మైన డ్రెస్ కోడ్ లో క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్‌-ఉపాసన దంప‌తులు వైట్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ దుస్తుల్లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌గా...తాజాగా అల్లు అర్జున్ -ఆయాన్ ముస్తాబైన వైనం ఆక‌ట్టుకుంటుంది.

తండ్రీ కొడుకులిద్ద‌రు ఒకే క‌ల‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రు బ్లాక్ షూట్ ధ‌రించిన‌ట్లు తెలుస్తోంది. హోట‌ల్ రూమ్ లో బ‌న్నీ-ఆయాన్ సంతోషంగా క‌నిపిస్తోన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అయ్యాయి. వాటితో ఇద్ద‌రు ఒకే డ్రెస్ కోడ్ లో క‌నిపిస్తున్నారు. కుమారుడు ఆయ‌న్ ని ఒళ్లు కూర్చోబెట్టుకుని బ‌న్నీ మురిసిపోతున్నాడు. ఆయాన్ బిగ్గ‌ర‌గా న‌వ్వుతూ క‌నిపిస్తున్నాడు.

కుమారుడిని చూసి బ‌న్నీ కూడా అంతే సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. `మై లిటిల్ బ్యాడ్ బోయ్` అనే ట్యాగ్ ని జోడించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. తండ్రీకొడుకుల సంతోషాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సాధార‌ణంగా బ‌న్నీ ఎక్కువ‌గా కుమార్తె అర్హ‌తో ఎక్కువ‌గా క‌నిపిస్తాడు. ఖాళీ స‌మ‌యం దొరికితే అర్హ‌తో పాటు చిన్న పిల్లాడిలా మారిపోతారు. ఇంట్లో అర్హ‌తో ఆడుకుంటోన్న వీడియోలు..ఫోటోలు షేర్ చేస్తుంటారు.

కానీ ఇట‌లీలో టూర్ లో ఆయ‌న్ హైలైట్ అవుతున్నాడు. చిట్టి అర్హ ఎక్క‌డ ఉంది? అంటూ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. అర్హ ఎంత అందంగా ముస్తాబైందో మాకూ చూపించ‌రంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇట‌లీలో పెళ్లి తంతు ముగియ‌గానే బ‌న్నీ నేరుగా హైద‌రాబాద్ చేరుకుంటారు. 5వ‌తేదిన రిపెప్షెన్ కూడా ఏర్పాటు చేయ‌డంతో అక్క‌డ క‌డా క‌చ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది

Tags:    

Similar News