హనుమాన్‌ : 50 డేస్‌ వెయిటింగ్‌.. ఇక చాలు!

సంక్రాంతికి విడుదల అయిన గుంటూరు కారంతో పాటు నా సామి రంగ మరియు సైంధవ్‌ సినిమాలను మించి వసూళ్లు సాధించింది.

Update: 2024-03-02 07:39 GMT

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొంది సంక్రాంతి కానుకగా వచ్చిన 'హనుమాన్‌' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి విడుదల అయిన గుంటూరు కారంతో పాటు నా సామి రంగ మరియు సైంధవ్‌ సినిమాలను మించి వసూళ్లు సాధించింది.

ఇన్నేళ్ల టాలీవుడ్‌ చరిత్రలో ఏ సంక్రాంతి సినిమా సాధించని వసూళ్లను హనుమాన్ సినిమా సాధించి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇంతటి సూపర్ హిట్‌ ను దక్కించుకున్న హనుమాన్‌ సినిమాను ఓటీటీ ద్వారా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ గత 50 రోజులుగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెర పడే సమయం ఆసన్నం అయ్యింది. హనుమాన్ సినిమాను మార్చి 8న ప్రముఖ ఓటీటీ జీ5 స్ట్రీమింగ్‌ చేయబోతుంది. పలు ఓటీటీ లు హనుమాన్ స్ట్రీమింగ్‌ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. కానీ చివరకు జీ5 దక్కించుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నిరంజన్‌ రెడ్డి నిర్మాణం లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మార్చి 8న జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అధికారిక ప్రకటన రాబోతుంది. సినిమా విడుదల సమయంలోనే హీరో తేజా 50 రోజుల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ చేస్తాం.. కనుక థియేటర్‌ కి వచ్చి చూడండి అన్నాడు.

అన్నట్లుగానే హనుమాన్‌ సినిమాను 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న కూడా ఓటీటీ ద్వారా చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

థియేట్రికల్‌ రిలీజ్ తో రికార్డుల వర్షం కురిపించిన హనుమాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ తో మరెంతగా రికార్డుల వర్షం కురిపిస్తాడో చూడాలి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ హనుమాన్‌ కి సీక్వెల్‌ గా జై హనుమాన్ ను రూపొందించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సీక్వెల్‌ వచ్చి ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంటుందా చూడాలి.

Tags:    

Similar News