గెలుపు గుర్రాలెక్కిన తారాలోకం!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయినా ఎక్క‌డా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఈసారి బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-06-05 06:07 GMT

ఎన్న‌డు లేనంత దేశ చ‌రిత్ర‌లో ఈ సారి ఎన్నిక‌లు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌త్యేకించి సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఈసారి ఎన్నిక‌ల్లో కంటెంస్ట్ చేయ‌డం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత కాలంగా పోటీ చేసి ఓడిపోయిన సెల‌బ్రిటీలు మ‌ళ్లీ బ‌రిలోకి దిగ‌డం..వాళ్ల‌తో పాటు కొత్త సెల‌బ్రిటీలు రాజ‌కీయంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరి వీళ్ల‌లో ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కారు? ఎవ‌రి అదృష్టం పండింది? ఎవ‌రు ఓట‌మి పాల‌య్యారో తెలుసుకుంటే స‌రి.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయినా ఎక్క‌డా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఈసారి బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్ర‌త్య‌ర్ధిపై భారీ మెజారిటీతో క‌లిసి కూట‌మిలో కీలక పాత్ర‌ధారిగా మారారు. ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ గెలుపుకు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. హిందూపురం నుంచి హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. అలాగే మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపీ కేర‌ళ‌లో స‌రికొత్త చ‌రిత్ర‌నే రాసారు. శ్రీశూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ ఘన విజయం సాధించారు.

భోజ్ పురీ నటుడు రవికిషన్ కూడా మ‌రోసారి జ‌య‌కేత‌నం ఎగ‌ర వేసారు. గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజ‌యం సాధించడం రెండ‌వ‌సారి. అదే ప‌రిశ్ర‌మ‌కు చెందిన మనోజ్ తివారీ కూడా ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా గెలిచారు. `రామాయ‌ణం` సీరియ‌ల్ లో రాముడి పాత్ర‌తో ఫేమ‌స్ అయిన అరుణ్ గోవిల్ బీజేపీ అభ్య‌ర్ధిగా మీర‌ట్ యోజకవర్గం నుంచి గెలిచారు.

అలాగే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడుశత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదే పార్టీ నుంచి తెలుగు సినిమాల్లో న‌టించిన ర‌చ‌నా బెర్జీ హుగ్లీ స్థానం విజయం సాధించారు. అలాగే మ‌రో సీనియ‌ర్ న‌టి హేమ మాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి భారీ మెజార్టీతో గెలిచారు. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ తొలిసారి బీజేపీ నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. తొలి ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అవుతుందా? లేదా? అన్న అనుమానులున్నా అన్నింటిని ప‌టాపంచల్ చేసింది.

క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ త‌రుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆమె త‌రుపున శివ‌న్న పెద్ద ఎత్తు ప్ర‌చారం చేసిన ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌లేదు. అలాగే ఏపీ నుంచి నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో న‌టి నవనీత్ కౌర్ కూడా ఓట‌మి చూసారు.

Tags:    

Similar News