ఆయ్… ఆ దూకుడేంది భాయ్
మనచుట్టూ జరిగే కథలనే మెయిన్ స్టోరీ లైన్ గా తీసుకొని వినోదానికి పెద్ద పీటవేస్తూ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.
మంచి కథాబలం, పూర్తిస్థాయి వినోదం ఉన్న సినిమాలకి ప్రేక్షకులు ఎల్లప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఈ నెలలో రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాయి. ఈ మూడు సినిమాలు లో బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకులకి ముందుకొచ్చాయి. మనచుట్టూ జరిగే కథలనే మెయిన్ స్టోరీ లైన్ గా తీసుకొని వినోదానికి పెద్ద పీటవేస్తూ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ప్రేక్షకుల కూడా ఈ కథలకి అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి బాగా కనెక్ట్ అయ్యారు.
దీంతో ఈ మూడు సినిమాలు మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సినిమాలకి ఎలాంటి ఆదరణ లభించిందో మూవీస్ కి వస్తోన్న కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాస్ నిర్మాతగా ఆగష్టు 15న రిలీజ్ అయిన మూవీ ఆయ్. ఈ సినిమాతో అంజిబాబు కె దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నార్నె నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ కాంపిటేషన్ ని తట్టుకొని బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది.
ఈ సినిమా రెండు వారాలు రన్ టైంని పూర్తి చేసుకోబోతోంది. 11 రోజుల పాటు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా అపూర్వ ఆదరణతో కొనసాగుతోంది. స్క్రీన్స్ కూడా 125 నుంచి 400కి పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలలో బీ,సి సెంటర్ ఆడియన్స్ నుంచి కూడా ఈ ఆయ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ కలెక్షన్స్ కూడా నిలకడగా సాగుతున్నాయి. 11 రోజుల్లోనే ఆయ్ మూవీ వరల్డ్ వైడ్ గా 13.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
వీకెండ్ మూడు రోజులు కూడా ఆయ్ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కృష్ణష్టామి రోజు కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ ని ఈ చిత్ర అందుకుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాక్సాఫీస్ ముందు ఆయ్ మూవీకి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బామ్మర్ది అనే ఇమేజ్ తో అడుగుపెట్టిన నార్నె నితిన్ కి మ్యాడ్ తర్వాత సోలోగా ఆయ్ మూవీతో సాలిడ్ సక్సెస్ వచ్చింది. ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి నయన సారిక కూడా తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేసింది. ఇదే ఊపులో ఆమె మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.