'గేమ్‌ ఛేంజర్‌' కోసం బాలీవుడ్‌ పఠాన్‌?

సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక మెల్లగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు.

Update: 2024-11-14 05:03 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇటీవల లక్నోలో భారీ ఈవెంట్‌ను నిర్వహించి టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. అదే విధంగా నార్త్‌ ఇండియాలో మరో మూడు నాలుగు ఈవెంట్స్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక సౌత్‌లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ గేమ్‌ ఛేంజర్‌ కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక మెల్లగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు.

ఈ సమయంలోనే షారుఖ్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌ జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి. ముంబైలో లేదా హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌ కోసం షారుఖ్ ఖాన్‌ ను ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి. హిందీలో గేమ్‌ ఛేంజర్‌ ను ఎక్కువ మందికి చేరువ చేయాలి అంటే షారుఖ్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరో రావాలని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాని గేమ్‌ ఛేంజర్‌ కి హిందీ రైట్స్ బిజినెస్ భారీగా జరగాలంటే షారుఖ్ ఖాన్ రావాలనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో గేమ్‌ ఛేంజర్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఎక్కడ ఆయన పాల్గొన్న కచ్చితంగా మంచి రీచ్ ఉండే అవకాశం ఉంటుంది.

రామ్‌ చరణ్ ను డ్యూయెల్‌ రోల్‌లో చూడబోతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించగా దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందుతున్న 50వ సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా పై మొన్నటి వరకు కొందరిలో అనుమానాలు ఉన్నాయి. శంకర్ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ క్లీయర్ అయింది. టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు సినిమాపై నమ్మకంగా ఉన్నారు.

శంకర్‌ గత చిత్రాలతో పోలిక లేకుండా ఈ సినిమాను తన వింటేజ్‌ జోనర్‌లో తీసుకు రాబోతున్నారట. రామ్‌ చరణ్ ను తండ్రి పాత్రలో చూపించిన తీరు బాగుంది. సింపుల్ మేకప్‌తో పాటు, యాక్షన్‌ సన్నివేశాల్లో చరణ్ ను చక్కగా చూపించారని తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయితే కచ్చితంగా రూ.1000 కోట్ల సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లేందుకు షారుఖ్‌ ఖాన్‌, చిరంజీవితో పాటు ఇంకా పలువురిని రంగంలోకి దించాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. సరిగ్గా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సమయంను సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని దిల్‌ రాజు అండ్‌ టీం భావిస్తున్నారు.

Tags:    

Similar News