చరణ్ తోనే ప్రయాణిస్తున్న పుష్ప కెప్టెన్

అమెరికాలో ఇలాంటి ప్రీ రిలీజ్ వేడుక జరగడం ఇదే తొలిసారి కావడంతో, ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Update: 2024-12-10 12:30 GMT

పుష్ప హడావుడి హై రేంజ్ లో ఉండడంతో సంక్రాంతి సినిమాల సందడి ఇంకా స్టార్ట్ కాలేదు. ఓ వారం తరువాత పొంగల్ సినిమాలకు సంబంధించిన అసలు సౌండ్ షురూ కానుంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఏ విదంగా చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 ప్రమోషన్ తోనే అసలైన బజ్ క్రియేట్ చేసుకుంది. కాబట్టి రాబోయే సినిమాలకు ఇదొక పాఠం లాంటిది. ఇక డిసెంబర్ 21న గేమ్ ఛేంజర్ మేకర్స్ అమెరికాలో సందడి చేయనున్నారు.

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అక్కడే జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఆ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలో ఇలాంటి ప్రీ రిలీజ్ వేడుక జరగడం ఇదే తొలిసారి కావడంతో, ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు సరైన బజ్ అందకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఈవెంట్ ద్వారా గేమ్ ఛేంజర్ పై ఆసక్తిని పెంచే ప్రయత్నం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య తదితర ప్రధాన తారాగణం పాల్గొనబోతోంది. దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇక ఈ ఈవెంట్ ప్రత్యేకతను మరింత పెంచుతూ, పుష్ప కెప్టెన్ సుకుమార్ ను ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. రామ్ చరణ్‌తో సుకుమార్ చేసిన రంగస్థలం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచాయి.

వింటేజ్ హై వోల్టేజ్ డ్రామా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం, ఒక కొత్త ట్రెండ్‌కి దారితీసింది. ఇక సుకుమార్ రామ్ చరణ్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్న విషయం తెలిసిందే. RC17 పేరుతో ప్రకటించిన ఈ చిత్రం 2025 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక, సుకుమార్ ప్రయాణానికి మరో ముఖ్యమైన కారణం పుష్ప 2 విజయోత్సవాన్ని అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

త్వరలో అల్లు అర్జున్, రష్మిక మందన్న అమెరికాలో పుష్ప 2 సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుకుమార్ రావడం మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే అమెరికా ఈవెంట్ తర్వాత డిసెంబర్ 28న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ వేస్తోంది. జనవరి 10 విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, ప్రచార కార్యక్రమాలకు మరింత వేగం పెంచుతున్నారు. రామ్ చరణ్ కు రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. ఇక గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకుంటే, రికార్డులు తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నుంచి ఈ చిత్రానికి పాటలు, ట్రైలర్, ఈవెంట్ల రూపంలో మరింత హైప్ తీసుకు రావాలని చూస్తున్నారు.

Tags:    

Similar News