'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సింహాసనం.. వేలంలో అంత వచ్చిందా?
జాన్ స్నో సిగ్నేచర్ వాచ్ 37,500 డాలర్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఎమీలియా క్లార్క్ గ్రే రెడ్ డేనేరీస్ టార్గారియన్ 1,12,500 డాలర్లకు విక్రయించినట్లు సమాచారం.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 2011లో మొదలైన ఆ హాలీవుడ్ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. 2018 వరకు దాదాపు ఎనిమిది సీజన్స్ ప్రేక్షకుల ముందుకు రాగా.. అన్నీ అలరించాయి. ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అనేక రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఆ సిరీస్ లో ఉన్న కత్తులతో చేసిన సింహాసనం వేలంలో రికార్డు సృష్టించింది!.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ సింహాసనం రెప్లికాను అమెరికాలోని డల్లాస్ లో జరిగిన వేలంలో భారీ ధరకు విక్రయించారు. ఐరన్ తో చేసిన రెప్లికాను హెరిటేజ్ ఆక్షన్ లో ఉంచారు. గురువారం నుండి శనివారం వరకు నిర్వహించిన వేలంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సింహాసనం రెప్లికాను సొంతం చేసుకోవడానికి అనేక మంది ఎగబడినట్లు తెలుస్తోంది. 1.5 మిలియన్ డాలర్లకు వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే సింహాసనం రెప్లికాతో పాటు 900 ఐకానిక్ వస్తువులను కూడా వేలం వేశారట. అందులో సిరీస్ కు సంబంధించిన కవచాలు, కత్తులు, ఆయుధాలు, నగలు, ఆర్మర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 4500 మందికిపైగా బిడ్డర్స్.. వేలంలో పాల్గొన్నట్లు సమాచారం. సింహాసనం రెప్లికానే కాకుండా.. 30 వస్తువులు ఆరు అంకెల ధరకు అమ్ముడుపోయినట్టు టాక్ వినిపిస్తోంది. జాన్ స్నో సిగ్నేచర్ స్వార్డ్ దాదాపు 4 లక్షల డాలర్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి.
జాన్ స్నో సిగ్నేచర్ వాచ్ 37,500 డాలర్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఎమీలియా క్లార్క్ గ్రే రెడ్ డేనేరీస్ టార్గారియన్ 1,12,500 డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. జైన్ లెనిస్టర్ బ్లాక్ లెదర్ ఆర్మర్ అండ్ కింగ్స్ గాడ్ ఆర్మర్ కూడా భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హెరిటేజ్ ఆక్షన్ కు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి. ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కదా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.