గేమ్ ఛేంజర్.. మళ్ళీ ఇదొక టెన్షనా?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కలిసి గత ఏడాది 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ కి మరిచిపోలేని రికార్డ్ ని ఇచ్చాయి. గత ఏడాది డంకీ మూవీ కూడా షారుఖ్ ఖాన్ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది.
డార్లింగ్ ప్రభాస్ సలార్ కి పోటీగా డంకీ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ పోటీలో ప్రభాస్ సలార్ తో విన్నర్ గా నిలిచాడు. సలార్ వేవ్ ముందు డంకీ నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ నుంచి ఒక్క ఫైటర్ మూవీ తప్ప చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు రాలేదు. అక్షయ్ కుమార్ నుంచి బడే మియాన్ చోటే మియాన్ మూవీ రిలీజ్ అయిన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
టాలీవుడ్ నుంచి మాత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో చాలా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 1150+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. నెక్స్ట్ సెప్టెంబర్ 27న దేవర మూవీ పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రానుంది. అయితే డిసెంబర్ నెలలో టాలీవుడ్ నుంచి ఎక్కువ సినిమాలు సందడి చెయ్యబోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాకి పోటీగా విక్కీ కౌశల్ చావా మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. అయితే పుష్ప ది రూల్ పై నార్త్ లో భారీ హైప్ నెలకొని ఉంది. ఇది చావాకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సారి షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ తో పోటీ పడబోతున్నారంట.
షారుఖ్ వాయిస్ ఓవర్ అందిస్తోన్న మఫాసా- ది లయన్ కింగ్ యామినేషన్ మూవీ కూడా అదే టైమ్ లో రిలీజ్ అవుతోంది. 2019లో వచ్చిన మఫాసా- ది లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ఇది రెడీ అవుతోందంట. ఇందులో షారుఖ్ ఖాన్ కొడుకులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ సింబ, జూనియర్ మఫాసా పాత్రలకి వాయిస్ అందించారంట. మఫాసా యానిమేషన్ మూవీకి ఇండియాలో మంచి ఆదరణ ఉంది.
గేమ్ ఛేంజర్ పైనే ఇప్పటికే పెద్దగా బజ్ లేదు. దర్శకుడు శంకర్ మీద ఇప్పటికే ఇండియన్ 2 ఎఫెక్ట్ వలన ఫ్యాన్స్ లో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువైతే కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉంది. టాక్ సాలీడ్ గా ఉంటేనే సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతాయి. అలాగే డిసెంబర్ లో మంచు విష్ణు కన్నప్ప మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతోంది. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్, వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమాలు డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్నాయి. నాగ్ చైతన్య తండేల్ మూవీ కూడా డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. మరి ఈ డిసెంబర్ పోటీ లో గేమ్ ఛేంజర్ ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.