గేమ్ ఛేంజర్.. ఈ డీల్ నిజమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజెర్ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది

Update: 2024-03-20 14:10 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజెర్ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ దర్శకుడు శంకర్ మరో సినిమా ఇండియన్ 2తో బిజీగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో మాత్రం ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ కూడా ఇచ్చింది లేదు. విడుదలైన కొన్ని పోస్టర్స్ కూడా అంతంత మాత్రమే అనేలా కామెంట్స్ వచ్చాయి. ఇక బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నట్లు ఇదివరకే చాలాసార్లు కథనాలు వెలువడ్డాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే వైరల్ గా మారిపోయింది. నిర్మాత దిల్ రాజుకు ఇదివరకే నెట్ ఫ్లిక్స్ నుంచి కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయట.

అయితే అమెజాన్ ప్రైమ్ పోటీపడి మరి గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. కేవలం ఒక భాషలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 100 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే గనక దిల్ రాజుతో పాటు రాంచరణ్ కెరియర్ లో కూడా ఇది ఒక బెస్ట్ రికార్డుగా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

అయితే నిజంగానే ఇంత ఈ రేంజ్ లో డీల్ సెట్ అయిందా అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సినిమాలకు ఇప్పటివరకు సరైన భజే క్రియేట్ కాలేదు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అనగానే కొంత నెగిటివ్ టాక్స్ వచ్చాయి. అంతేకాకుండా లీకైన ఒక సాంగ్ కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చాలా రోజులుగా కోరుకుంటున్నారు.

ఇక దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ కంటే ఇండియన్ 2 పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. మరోవైపు ఆయనకు కూడా చాలా కాలంగా సక్సెస్ లేదు. అప్పుడెప్పుడో రోబో సినిమాతో సక్సెస్ అందుకున్న శంకర్ ఆ తర్వాత చేసిన స్నేహితుడు, ఐ మనోహరుడు, 2.0 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు అందించలేకపోయాడు.

కాబట్టి ఇప్పుడు ఏ లెక్కలో గేమ్ చేంజర్ కు ఊహించని రేంజ్ లో 105 కోట్ల డిజిటల్ డీల్ సెట్ అవుతుంది అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ రేంజ్ లో సెట్టయితే మంచిదే కానీ ఇంకా సరైన అప్డేట్స్ కూడా రానిదే అమెజాన్ ప్రైమ్ ఆ రేంజ్ లో ఆఫర్ చేస్తుందా అనే కామెంట్స్ వస్తున్నాయి. డీల్ సెట్ అయి ఉండవచ్చు. కానీ మరీ ఈ స్థాయిలో రాకపోవచ్చు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News