గేమ్ ఛేంజర్.. అసలు ఆటకు టైముంది!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-08-24 04:38 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” తర్వాత రామ్ చరణ్ నుంచి సోలో మూవీ రాక రెండేళ్లు అయిపోతోంది. “ఆర్ఆర్ఆర్” తో వచ్చిన పాన్ ఇండియా బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రామ్ చరణ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేసిన “గేమ్ చేంజర్” తన ఇమేజ్ ని మరింత పెంచుతుందని చరణ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.

దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. శంకర్ ప్రస్తుతం “గేమ్ చేంజర్” పోస్ట్ ప్రొడక్షన్ పైన దృష్టిపెట్టారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ఈ సినిమాపైన హైప్ క్రియేట్ చేసే రేంజ్ అప్డేట్ ఇప్పటి వరకు శంకర్ నుంచి రాలేదు. మెగా ఫ్యాన్స్ సాలిడ్ అప్డేట్ ని కోరుకుంటున్నారు. “దేవర” సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ఆ చిత్రంపైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి.

అదే స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ చేసే సాంగ్స్ లేదంటే టీజర్ “గేమ్ చేంజర్” నుంచి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే “గేమ్ చేంజర్” నుంచి జరగండి జరగండి అంటూ సాగే పాటని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేసిన పెద్ద కిక్ ఇవ్వలేదు. సాంగ్ ట్యూన్ కూడా కాపీ అంటూ విమర్శలు వచ్చాయి. థమన్ నుంచి అంతకుమించిన బీట్స్ ని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల చివరి వారంలో అప్డేట్స్ స్టార్ట్ అవుతాయని టాక్ వచ్చింది. కానీ అది నిజం కాదు.

సెప్టెంబర్ మధ్య నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందులో భాగంగా “గేమ్ చేంజర్” సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఈ సాంగ్ మాత్రం సినిమాపై పబ్లిక్ అటెన్షన్ పెరిగేలా చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. థమన్ కూడా ఇప్పటికే గేమ్ చేంజర్ సాంగ్స్ అదిరిపోతాయని ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.

శంకర్ కూడా సాంగ్స్ ప్రెజెంటేషన్స్ విషయంలో అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో “గేమ్ చేంజర్” సాంగ్స్ ని కూడా హైలెవల్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ సాంగ్ క్లిక్ అయితే గేమ్ చేంజర్ మీద హై రేంజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వొచ్చనే మాట ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇండియన్ 2 డిజాస్టర్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ బిజినెస్ మీద ఏమైనా పడుతుందా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా ఉంది.

Tags:    

Similar News