గేమ్ ఛేంజర్.. మళ్లీ ఇదేం ట్విస్ట్?

భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ పై ప్రస్తుతం నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2024-02-26 00:30 GMT

గేమ్ ఛేంజర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ. చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం స్టార్ట్ అయ్యింది.

కానీ ఇంతవరకు పూర్తి కాలేదు. షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే షూటింగ్ లేట్ ఎలాగో అవుతుంది.. కనీసం మేకర్స్ అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో ఇటీవల నిర్మాత దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ లో వస్తుందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు. ఏదో ఒక అప్డేట్ వచ్చింది కదా అని సరదా పడ్డారు. కానీ ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ ఓ నిర్ణయానికి రాలేదట.

భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ పై ప్రస్తుతం నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దిల్ రాజు చెప్పినట్టు.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కానీ ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ, దేవర రిలీజ్ డేట్స్ ను ఆయా మేకర్స్ ఫిక్స్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ.. సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా.. అక్టోబర్ 10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ దేవర విడుదల కానుంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఏమైనా ఛేంజ్ ఉంటే.. అప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ విడుదల కోసం ప్లాన్ చేస్తారట. దీనిపై ఇంకా మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇది విన్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీలవుతున్నారు. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

మరికొంతమంది.. గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇంకొందరు వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుందని చెబుతున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 10 రోజులపాటు జరిగింది. హై యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ షూట్ జరిగినట్లు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంతకీ ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Full View
Tags:    

Similar News