ఆ సైకిల్ సీన్ బాక్సాఫీస్ గేమ్ ఛేంజర్?

అందులో చ‌ర‌ణ్ తండ్రి పాత్ర స‌ర్ ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్ర సైకిల్ పై అసెంబ్లీకి, సీఎం ఛాంబ‌ర్ కి వెళుతుందిట‌.

Update: 2024-05-27 13:46 GMT

2024-25 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ మూవీగా 'గేమ్ ఛేంజర్' గురించి ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఏడాది చివ‌రిలో విడుద‌ల‌య్యేందుకు అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చా సాగుతోంది. నిర్మాత దిల్ రాజు దీనిపై ఇంకా పూర్తి స్ప‌ష్ఠ‌త‌ను ఇవ్వాల్సి ఉంది.

ఇంత‌కుముందు 'జ‌ర‌గండి' పాట గ్లింప్స్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. శంక‌ర్ మార్క్ మేకింగ్‌తో ఈ పాట హైలైట్ కానుండ‌గా త‌మ‌న్ మ్యూజిక్ యావ‌రేజ్ అన్న చ‌ర్చా సాగింది. ఇక‌పోతే గేమ్ ఛేంజర్‌ లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రధానంగా సాగ‌నున్నాయి. క‌థ గురించి ఇప్ప‌టికే చాలా లీకులు అందాయి. ఒక ఐఏఎస్ అధికారి ఎలాంటి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి అయ్యాడు? ప్ర‌త్య‌ర్థుల‌తో ఎలాంటి ఫైట్ చేసాడ‌న్న‌ది తెర‌పై చూపిస్తున్నార‌ని లీకులు అందాయి. ప్ర‌పంచంలోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ట్రైన్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ స‌హా చాలా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని శంక‌ర్ టీమ్ తెర‌కెక్కించారు.

ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన లీక్ అందింది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఊహాతీతంగా ఉంటుంద‌ట‌. అందులో చ‌ర‌ణ్ తండ్రి పాత్ర స‌ర్ ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్ర సైకిల్ పై అసెంబ్లీకి, సీఎం ఛాంబ‌ర్ కి వెళుతుందిట‌. ఈ సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయ‌ని, సైకిల్ పై స‌న్నివేశాలు కాబ‌ట్టి తెలుగు దేశం పార్టీ వాళ్లు నంద‌మూరి తార‌క రామారావు సైకిల్ ఫీట్ ని గుర్తు చేసుకుంటార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అన్న‌గారు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సైకిల్ గుర్తుతో పోటీ చేసి సీఎం అయ్యారు. తేదేపాతో సైకిల్ చ‌క్రాల‌కు ముడిప‌డి ఉన్న అనుబంధం ఎంతో గొప్ప‌ది. తేదేపాకు గేమ్ ఛేంజ‌ర్ సైకిలే కాబ‌ట్టి, ఇప్పుడు సైకిల్ పై చ‌ర‌ణ్ వృద్ధ పాత్ర అసెంబ్లీకి వెళ్ల‌డం అన్న‌ది ఉత్కంఠ క‌లిగించేదే. చ‌ర‌ణ్ పోషించే తండ్రి పాత్రకు అంజ‌లి జంట‌గా క‌నిపిస్తుంది. వారి కుమారుడు (ప్రస్తుత రామ్ చరణ్ పోషించిన పాత్ర) IAS అధికారి అవుతాడు. అత‌డి స‌ర‌స‌న కియ‌రా జ‌త‌గా క‌నిపిస్తుంది.

Tags:    

Similar News