గేమ్ ఛేంజర్ 15 రోజులే బ్యాలెన్స్!
ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుందని..దీంతో షూట్ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం పనులు కూడా మొదయ్యాయి. లిరికల్ సింగిల్స్ తో శ్రోతల్ని అలరిస్తున్నారు. మరి సినిమా షూటింగ్ అప్ డేట్ ఏంటి? టాకీ ఎంత వరకూ పూర్తయింది? అంటే! ముగింపుకు చేరుకున్నట్లే తెలుస్తోంది. 85 శాతం షూటింగ్ పూర్తయిందని..ఇంకా 15 శాతమే బ్యాలెన్స్ ఉందని తాజాగా చిత్ర వర్గాల నుంచి తెలిసింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుందని..దీంతో షూట్ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు.
అంటే వేసవి ముదరకుండానే శంకర్ అండ్ కో షూటింగ్ ముగించుకుని వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నెలఖరుకల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. అందుకు కూడా సమయం ఎక్కువగానే తీసుకుంటున్న్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంటే దాదాపు ఆరు నెలలు పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకే శంకర్ టైమ్ కేటాయించినట్లు తెలుస్తోంది.
శంకర్ సినిమాలంటే ఆ మాత్రం టెక్నికల్ వర్క్ తప్పనిసరి. టెక్నికల్ యాస్పెక్ట్ లోనూ ఆయన సినిమాలు హైలైట్ అవుతుంటాయి. `గేమ్ ఛేంజర్` లో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అవెంతో క్రియేటివ్ గా ఉంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి విజువల్ వర్క్ కి సంబంధించి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. పైగా శంకర్ సినిమలకు చాలా వరకూ సీజీ వర్క్ విదేశాల్లో జరుగుతుంటుంది. కొన్ని పనులు మాత్రమే చెన్నై స్టూడియోల్లో చేస్తుంటారు.
ఓరిజినాల్టీ..నేచురాల్టీ విషయంలో శంకర్ రాజీ పడేది ఉండదు. షూట్ పూర్తయిన తర్వాత సీపీ వర్క్ లకే కోట్ల రూపాయలు వెచ్చించిన సందర్భాలెన్నో. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కి భారీగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ నుంచి రామ్ చరణ్ ఆర్సీ 1 6షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు కూడా చిత్రీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్ల నిర్మాణం జరుగుతుంది.