బిగ్ బాస్ 8 : ఎలిమినేట్ అవ్వాల్సినోడు.. టైటిల్ అడుగు దూరంలో..?

ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఎవరిది.. విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది. నిఖిల్, గౌతం లలో ఎవరు గెలిచినా సరే వారిద్దరు దానికి అర్హులు అని చెప్పొచ్చు.

Update: 2024-12-11 10:59 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 గా ఆడియన్స్ మెప్పు పొందిన వారు వచ్చారు. ఈ సీజన్ లో అర్హత ఉన్న వారికే ఫైనలిస్ట్ గా వచ్చారన్న టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8లో నిఖి, గౌతం, ప్రేరణ, నబీల్, అవినాష్ లు టాప్ 5గా ఉన్నారు. వారిలో టైటిల్ రేసులో ఉన్నది నిఖిల్ గౌతం మాత్రమే. నిఖిల్ సీజన్ మొదటి నుంచి హౌస్ లో ఉన్నాడు. కానీ గౌతం కృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చాడు. అలా వచ్చిన రెండో వారమే హౌస్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం ఎలిమినేషన్ టైం లో హౌస్ లో తాను ఉండలేనని మణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఐతే ఆ టైం లో ఆడియన్స్ పోల్ ద్వారా లీస్ట్ లో ఉన్నది గౌతమే. ఐతే మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ వల్ల అతన్ని పంపించి గౌతం ని ఉంచారు. ఐతే అప్పటి నుంచి ప్రతి టాస్క్ లో తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు గౌతం. ఇక నిఖిల్ తో, పృధ్వితో గౌతం ఫైట్ తెలిసిందే. టాస్కులు, నామినేషన్స్ అన్నిటిలో గౌతం ఆవేశం ఆడియన్స్ కు నచ్చింది.

అందుకే ఎలిమినేట్ అవ్వాల్సిన పొజిషన్ నుంచి టైటిల్ కొట్టేస్తాడు అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అంతేకాదు ఈ సీజన్ లో కన్నడ వర్సెస్ తెలుగు అనే ఒక ఫైట్ నడుస్తుంది. తెలుగు బిగ్ బాస్ లో కన్నడ నుంచి వచ్చిన నటులకు టైటిల్ ఇవ్వడం ఎందుకని బయట ఆడియన్స్ చర్చిస్తున్నారు. హౌస్ లో ఉన్న వారికి అది తెలియకపోయినా బయట మాత్రం కన్నడ వర్సెస్ తెలుగు ఫైట్ ఒక రేంజ్ లో ఉంది.

అంతేకాదు నిఖిల్ హౌస్ లో అమ్మాయిలతో చేసిన పులిహోర కార్యక్రమాలు కూడా అతన్ని టైటిల్ రేసుకి దూరం అయ్యేలా చేస్తున్నాయని తెలుస్తుంది. ఐతే ఇంతవరకు బిగ్ బాస్ 7 సీజన్లలో ఎవరు కూడా వైల్డ్ కార్డ్ గా వచ్చి టైటిల్ విన్నర్ అవ్వలేదు. ఒకవేళ గౌతం అలా టైటిల్ గెలిస్తే మాత్రం రికార్డ్ అవుతుంది. గౌతం కూడా ఫ్యామిలీ వీక్ లో అంతా తనను టాప్ లో పెట్టగా అప్పటి నుంచి మరింత కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు.

ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఎవరిది.. విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది. నిఖిల్, గౌతం లలో ఎవరు గెలిచినా సరే వారిద్దరు దానికి అర్హులు అని చెప్పొచ్చు.

Tags:    

Similar News