స్టార్ హీరోలకు ఆ డైరెక్టర్ ని దూరం చేస్తోన్న అజ్ఞాతవాసి!
అవకాశం వస్తే డైరెక్షన్ చేస్తున్నారు. త్వరలో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన `డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్` ప్రేక్షకుల ముందుకొస్తుంది.
గౌతమ్ మీనన్ ఒకప్పుడు ఎలాంటి క్లాసిక్ లవ్ స్టోరీలు చేసారో చెప్పాల్సిన పనిలేదు. మణిరత్నం తర్వాత లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్ స్పెషలిస్ట్ గా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే తర్వాత కాలంలో గౌతమ్ సినిమాలు వైఫల్యాల బాట పట్టడంతో? అవకాశాలు తగ్గాయి. దీంతో నటుడిగానూ తెరంగేట్రం చేసారు. అలాగని డైరెక్షన్ కి దూరంగా కాలేదు. అవకాశం వస్తే డైరెక్షన్ చేస్తున్నారు. త్వరలో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన `డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్` ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏ సినిమా విషయంలో జరిగిందన్నది తెలియదు గానీ రజనీకాంత్ ను తన సినిమాకు ఓ వ్యక్తి దూరం చేసినట్లు తెలిపారు. నేను వినిపించిన స్క్రిప్ట్ రజనీకాంత్ కి నచ్చింది. ఆయన చేద్దామని అంగీకరించారు. కాను మరుసటి రోజు సాయంత్రానికి రజనీకాంత్ ఎవరో ఇచ్చిన సలహా మేరకు వెనక్కి తగ్గారు. నా గురించి అతనితో ప్రతికూలంగా ఎవరు మాట్లాడారో నాకు తెలుసు.
కానీ నేను వారి పేరు బహిరంగంగా చెప్పాలనుకోవడం లేదు` అన్నారు. అలాగే కొన్నాళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ `వెట్టైయాడు విలైయాడు` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో కమల్ హాసన్ తో తలెత్తిన వివాదాన్ని గౌతమ్ గుర్తు చేసుకున్నారు. `ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఎలా నటించాలో ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు కమల్ హాసన్ నాపై చిరాకు పడ్డారు.
ఆ విషయంలో నాపై నిర్మాతకు కూడా ఫిర్యాదు చేసారు. కమల్ హాసన్ ఎవరైనా తనకు నటన ఎలా నేర్పించ గలరని ప్రశ్నించారన్నారు. ఆ తర్వాత నేను ఏ సన్నివేశంలోనూ ఎలా నటించాలో వివరించే ప్రయత్నం చేయలేదు. ఆయన గొప్ప నటులు. ప్రతీ సినిమాలోనూ ది బెస్ట్ పెర్పార్మెన్స్ ఇస్తారు` అన్నారు.