మహేష్ వారసుడు గౌతమ్ నట శిక్షణ
ప్రపంచవ్యాప్తంగా మహేష్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అతడి మార్కెట్ రేంజును ఎలివేట్ చేస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా లెగసీని ముందుకు నడిపిస్తున్నాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో కెరీర్ ని ప్రారంభించి రెండు దశాబ్ధాల్లో సూపర్ స్టార్ గా ఆవిర్భవించిన మహేష్ సౌతిండియాలోనే ఎదురేలేని నటుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మహేష్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అతడి మార్కెట్ రేంజును ఎలివేట్ చేస్తోంది.
అయితే మహేష్ తర్వాత ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం తారలు ఎవరున్నారు? అంటే .. మహేష్ వారసులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని తండ్రి లెగసీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. గౌతమ్ ఇప్పటికే ప్లస్ 2 పూర్తి చేసి బ్యాచిలర్స్ చదివేందుకు లండన్ వెళ్లారు. అక్కడ కాలేజ్ స్టడీస్ ని కొనసాగిస్తూనే, మరోవైపు నట శిక్షణ తీసుకుంటారని, దానికోసం న్యూయార్క్ ఫిలిం అకాడెమీకి వెళతాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఛరిష్మాలో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న గౌతమ్ కి నట శిక్షణ పూర్తయ్యేప్పటికి పాతిక వయసు వస్తుంది. అప్పుడు అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సరైన సమయం. దీనికి మరో నాలుగైదేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సితార ఘట్టమనేని ఇంతకుముందు వాణిజ్యప్రకటనల్లో కనిపించి వేవ్స్ క్రియేట్ చేసింది. బాలనటిగా ఎంట్రీ ఇస్తే తన క్రేజ్ ఆషామాషీగా ఉండదు. సితారకు నటన జీన్స్ లోనే ఉంది. అందువల్ల తను పెద్ద స్టార్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గౌతమ్ కృష్ణ నటుడిగా ఆరంగేట్రం చేస్తే చూడాలని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మహేష్ తరహాలోనే రాజకుమారుడిలా ఎంట్రీ ఇస్తాడా? లేక గౌతమ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహాలం అందరిలో ఉంది. అయితే మరో నాలుగైదేళ్లు వేచి చూస్తేనే కానీ దేనికీ క్లారిటీ రాదు.