2025 సంక్రాంతి.. ఆ టాలెంటెడ్ హీరో వస్తే డేంజరే

వీటిలో రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే గుంటూరు కారం ఎవరేజ్ గా నిలిచింది. సైంధవ్ డిజాస్టర్ అయ్యింది

Update: 2024-01-23 05:07 GMT

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ లో ప్రతి హీరోకి ఇష్టమే. ఈ టైంలో మూవీ రిలీజ్ చేస్తే మినిమమ్ పర్వాలేదని టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ అందుకొని మూవీ సూపర్ హిట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది అనే నమ్మకం బలంగా ఉంది. నిర్మాతలు కూడా అందుకే సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ కాంపిటేషన్ ప్రతి ఏడాది పెరిగిపోతూ వస్తోంది.


ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి ఐదు సినిమాలు వస్తే అందులో ఫైనల్ గా థియేటర్స్ సమస్య కారణంగా నిర్మాతల చర్చల తర్వాత ఈగల్ మూవీ తప్పుకుంది. తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయ్యే సినిమాలకి అస్సలు థియేటర్స్ దొరకలేదు. టాలీవుడ్ లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెజారిటీ థియేటర్స్ గుంటూరు కారంకి వెళ్లాయి. అలాగే హనుమాన్, సైంధవ్, నా సామి రంగా సినిమాలు మిగిలిన థియేటర్స్ పంచుకున్నాయి.

వీటిలో రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే గుంటూరు కారం ఎవరేజ్ గా నిలిచింది. సైంధవ్ డిజాస్టర్ అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచి హీరోలు, నిర్మాతలు కర్చీఫ్ వేసేస్తున్నారు. సినిమా అనేది అతిపెద్ద వ్యాపారంగా మారుతూ ఉండటంతో రిలీజ్ టైమింగ్ అనేది చాలా ముఖ్యం అయిపొయింది. అందుకే సంక్రాంతి పోటీ కోసం అప్పుడే నాలుగు సినిమాలు రేసులోకి వచ్చాయి.

వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న విశ్వంభరని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. దీని తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి శతమానం భవతి నెక్స్ట్ పేజీ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా క్యాస్టింగ్ అండ్ క్రూ ఎవరనేది ఖరారు చేయకపోయిన సంక్రాంతి రిలీజ్ అయిన ఒక వీడియోని దిల్ రాజు విడుదల చేశారు.

కింగ్ నాగార్జున బంగార్రాజు సీక్వెల్ కూడా రెడీ చేస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో పాటు ఇప్పుడు అడవి శేష్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో వినయ్ కుమార్ శిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గూఢచారి 2 మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యుల్ కంప్లీట్ అయ్యింది. అడవి శేష్ సంక్రాంతి రేసులోకి వస్తే కాంపిటేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Tags:    

Similar News