సమంత ఫ్యాన్స్ కి అతి పెద్ద గుడ్ న్యూస్..!
అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటుందట.
స్టార్ హీరోయిన్ సమంత ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ బిజీ అవ్వబోతుంది. మయోసైటిస్ అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఏడాది సమయం తీసుకున్న సమంత ఇకపై సమయం అసలు వృధా కానివ్వకూడదని భావిస్తుందట. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటుందట.
ఇప్పటికే పాన్ ఇండియా మూవీ బంగారం షూటింగ్ దశలో ఉంది. మరో వైపు రెండు వెబ్ సిరీస్ లతో కూడా సమంత రెడీ అవుతుందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్ లను సమంత కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
'రక్త్ బ్రహ్మాండ్' షూటింగ్ లో పాల్గొంటున్న సమంత మరో వైపు కథలు వింటూనే ఉందట. బహు భాష చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా సమంత సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రెండేళ్లలో సమంత నటించిన సినిమాలు మరియు సిరీస్ లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.
నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ తో ఇప్పటికే సమంత ఒప్పందాలు జరిగాయి. వాటికి సంబంధించిన షూటింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. ప్రస్తుతం సమంత సినిమాలు, సిరీస్ లు, కమర్షియల్ యాడ్స్ షూట్స్ తో బిజీ బిజీగా ఉంది.
వరుసగా సినిమాలు చేస్తున్న సమంత ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా సమంత కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఫ్యామిలీ స్టార్ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సమంత కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
ఆమె సినిమాలు మరియు సిరీస్ ల కోసం అన్ని భాషల ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో సమంత నటిస్తున్న మరియు నటించబోతున్న రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతుంది. ఇది కచ్చితంగా సామ్ పాన్ ఇండియా ఫ్యాన్స్ కి అతి పెద్ద గుడ్ న్యూస్