సాలిడ్ హిట్ పడితే కానీ ఆ హీరో గురించి పట్టించుకోరు..!
కమర్షియల్ సినిమాల్లో కంటెంట్ ఉండేలా చూసుకుంటూ వచ్చిన గోపీచంద్ అన్ లక్కీగా సినిమాల ఫలితాలతో నిరాశ పరుస్తూ వచ్చాడు.
టాలెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు లక్ ఫేవర్ చేస్తేనే కెరీర్ సక్సెస్ ట్రాక్ లో నడుస్తుంది. సినిమా కోసం ఎవరెంత కష్టపడుతున్నా ఆ కష్టానికి ఎంతోకొంత లక్ అనేది తోడవ్వాలి. టాలీవుడ్ హీరోల్లో అలాంటి హీరోలు కొందరు ఉండగా వారిలో ముందు వరుసలో ఉంటాడు మాచో హీరో గోపీచంద్. కెరీర్ తొలినాళ్లలో హీరోగా వర్క్ అవుట్ కాదేమో అనుకుని విలన్ వేషాలు వేయగా మళ్లీ అతన్ని కాలం హీరోని చేసింది.
హీరోగా మాస్ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకోగా సడెన్ గా ఎందుకో కెరీర్ డ్రాప్ అవుతూ వచ్చింది. కమర్షియల్ సినిమాల్లో కంటెంట్ ఉండేలా చూసుకుంటూ వచ్చిన గోపీచంద్ అన్ లక్కీగా సినిమాల ఫలితాలతో నిరాశ పరుస్తూ వచ్చాడు. 2014 లో లక్ష్యం తర్వాత గోపీచంద్ కి సరైన హిట్ పడలేదు. 2015 లో వచ్చిన జిల్ పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వచ్చిన గౌతం నంద, పంథం, చాణక్య ఇవేవి పెద్దగా ఆడలేదు.
2021 లో వచ్చిన సీటీమార్ తో మరోసారి మాస్ అటెంప్ట్ చేసిన గోపీచంద్ ఆ సినిమాతో బజ్ బాగానే వచ్చినా కమర్షియల్ గా అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక 2022 లో పక్కా కమర్షియల్ అని మారుతి డైరెక్షన్ లో సినిమా చేశాడు. బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ గా వచ్చినా అది కూడా యావరేజ్ గానే నిలిచింది.
ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన రామబాణం మరో పెద్ద షాక్ ఇచ్చింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్న గోపీచంద్ ఫైనల్ గా భీమా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష డైరెక్ట్ చేస్తున్నారు. కన్నడలో 15 ఏళ్లలో పది సినిమాలు చేసినా అవన్ని సూపర్ హిట్ కాగా అలాంటి డైరెక్టర్ తో గోపీచంద్ భీమా అంటూ వస్తున్నాడు. ఈ సినిమా మీద గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ప్రచార చిత్రాలు సినిమాపై బజ్ పెంచగా సినిమా అనుకున్న రేంజ్ హిట్ పడితే మళ్లీ తిరిగి గోపీచంద్ ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
గోపీచంద్ కి మాస్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా కెరీర్ సరైన ట్రాక్ లో లేకపోవడం వల్ల ఈ హీరో సినిమాలకు పెద్దగా బజ్ లేదు. అసలైతే ఫిబ్రవరి లో భీమా రిలీజ్ అనుకున్నారు కానీ ఎందుకో వాయిదా వేసుకున్నారు. సాలిడ్ హిట్ తో గోపీచంద్ తిరిగి ఫాం లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.