గేమ్ ఛేంజర్ కోసం అక్కడాయన...ఇక్కడీయనా?
`గేమ్ ఛేంజర్` రిలీజ్ సమయం దగ్గర పడుతుంది. జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టడానికి సమాయాత్తం అవుతున్నారు.
`గేమ్ ఛేంజర్` రిలీజ్ సమయం దగ్గర పడుతుంది. జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టడానికి సమాయాత్తం అవుతున్నారు. పుష్ప తరహాలో దేశ వ్యాప్తంగా సినిమాని ప్రచారం చేయాలని శంకర్ అండ్ కో ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రచారం కోసం ఎంత ఖర్చు కైనా వెనక్కి తగ్గలేదు. ఓపెనింగ్స్ రూపంలోనే మొత్తం రాబట్టే స్ట్రాటజీతో ముందుకు కదులుతున్నారు.
దీనిలో భాగంగా రిలీజ్ కి 20 రోజులు ముందుగానే దేశ వ్యాప్త ప్రచారం మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ అమెరి కాలో నిర్వహిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నెల 21న డల్లాస్‌లోని కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టీఎక్స్ 75040 వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ని ఆహ్వానించారు. ఆయన కూడా వస్తున్నారు. మరి హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించరా? అంటే చివరిగా ప్రచారం ముగించేది భాగ్యనగరం ఈవెంట్ తోనే. భారీ ఎత్తున ఓ పెద్ద గ్రౌండ్ లో ఈ వెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్. ఎస్ రాజమౌళిని ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారుట. అలాగే కొంత మంది స్టార్ హీరోలు కూడా వేడుకలో భాగమయ్యేలా సన్నాహాలు చేస్తున్నారుట.
రామ్ చరణ్-శంకర్ ఈవెంట్ అంటే రాజమౌళి రాకుండా ఎలా ఉండగలరు. తప్పక విచ్చేసి వాళ్ల పనితనాన్ని కొనియా డాల్సిందే. రామ్ చరణ్ తో ఇప్పటికే రాజమౌళి రెండు సినిమాలు కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మగధీర, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో చరణ్ తో జక్కన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది.