వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌కి 'గీతా గోవిందం' ఇష్టం

2024 వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌లో గెలిచి కొత్త వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించాడు.

Update: 2024-12-18 11:08 GMT

అతి పిన్న వయసులో చెస్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం గుకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో వరల్డ్‌ ఛాంపియన్‌ గెలిచి రికార్డ్‌ సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే అనుకున్నదాని కోసం కష్టపడ్డాడు, అతడి ప్రయత్నం విఫలం కాలేదు, 2024 వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌లో గెలిచి కొత్త వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతడి గురించే మాట్లాడుకుంటున్నారు.

ప్రపంచం మొత్తం అతడి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇండియాలో వీధి వీధిలో అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతి స్కూల్‌లోనూ గుకేష్ గురించి పిల్లలకు చెబుతూ ఇన్ఫిపిరేషన్‌ను నింపుతున్నారు. కోట్లది మందికి ఆదర్శంగా మారిన గుకేష్‌ దొమ్మరాజు ఒక ఇంటర్వ్యూలో సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా చెస్‌ ఛాంపియన్స్‌, బాగా చదివే వారు సినిమాలు చూడరు అనుకుంటాం. కానీ గుకేష్‌ అన్ని భాషల సినిమాలు చూస్తారని, అన్ని భాషల్లోనూ అతడికి అభిమాన సినిమాలు ఉన్నాయని అతడి మాటలతో అర్థం అవుతుంది.

ఒక ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్‌ మూవీ ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో ఒక్కో భాషకు ఒక్కో సినిమా తన ఫేవరేట్‌ అంటూ చెప్పుకొచ్చాడు. తమిళ్‌లో సూర్య హీరోగా నటించిన వారణం ఆయురం తనకు నచ్చిన సినిమా అన్నాడు. ఇక తెలుగు లో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన 'గీతా గోవిందం' సినిమా అంటే తనకు ఇష్టం అన్నాడు. హిందీలో హృతిక్‌ రోషన్‌ నటించిన జిందగీ నామిలే దుబారా సినిమా ఇష్టం అంటూ చెప్పిన గుకేష్‌ ఇంగ్లీష్ సినిమాల్లో అబౌట్‌ టైమ్‌ సినిమా ఇష్టంగా చెప్పుకొచ్చాడు.

దీన్ని బట్టి చూస్తే గుకేష్‌ అన్ని భాషల సినిమాలు చూస్తాడని అర్థం అవుతోంది. తెలుగులో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఉండగా విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాను ఇష్టపడ్డాడు అంటే అతడికి ఫ్యామిలీ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు అంటే ఇష్టం అయ్యి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి రౌడీ స్టార్‌ సినిమా తన అభిమాన సినిమా అంటూ చెప్పడం ద్వారా గుకేష్‌ అతడి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News