పాకిస్తానీల న‌షాలానికి గుంటూరు కారం

ఓటీటీలో రిలీజైన గుంటూరు కారం చిత్రాన్ని దాయాదులు ఐదు వారాల పాటు ఎగ‌బ‌డి చూసేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Update: 2024-03-14 03:37 GMT

అవును.. పాకిస్తానీల న‌షాలానికి `గుంటూరు కారం` అంటింది. ఈ కారం చాలా ఘాటుగా మ‌తి చెడేలా ఉంది అంటూ అక్కడ ప్ర‌జ‌లంతా సంబ‌రంగా చెప్పుకున్నారు. అంత‌గా మ‌న `గుంటూరు కారం` న‌చ్చేసింది అక్క‌డ‌. మ‌హేష్ న‌టించిన గుంటూరు కారం తెలుగులో దేశంలోని ఇత‌ర భాష‌ల్లో ఫ్లాపైనా కానీ, పాకిస్తానీల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంద‌ని తాజా ఓటీటీ చార్టులు చెబుతున్నాయి.

ఓటీటీలో రిలీజైన గుంటూరు కారం చిత్రాన్ని దాయాదులు ఐదు వారాల పాటు ఎగ‌బ‌డి చూసేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. భారతదేశ ప్రాంతంలో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాలలో అన్వేషిప్పిన్ కందెతుమ్ , మెర్రీ క్రిస్మస్ వంటి సినిమాలు అగ్రస్థానంలో నిలిచాయి, అయితే మహేష్ చిత్రం గుంటూరు కారం వరుసగా ఐదవ వారంలోను జాబితాలో నిలిచింది.

భార‌త‌దేశంలో పెద్ద ఫెయిలైన ఈ చిత్రం పాకిస్తానీల‌కు బాగా న‌చ్చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ చిత్రం బంగ్లాదేశ్ - పాకిస్తాన్ వీక్లీ చార్టులలో ఐదు వారాల ప్రదర్శనను కొనసాగించ‌డం ఆశ్చ‌ర్యంలోకి దించేసింది. కింగ్ ఖాన్ షారూఖ్‌ క‌థానాయ‌కుడుగా రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన డంకీ కూడా నెట్ ఫ్లిక్స్ లో దేశ విదేశాల్లో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

Tags:    

Similar News