గుంటూరు కారం.. మొదట్లోనే స్టన్ అయ్యేలా..

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి.

Update: 2024-01-07 12:03 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే గుంటూరు కారం లో వింటేజ్ మహేష్ ని చూసేందుకు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. సినిమా నుంచి మరికొద్ది గంటల్లో విడుదలవుతున్న ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.

అదేంటంటే, గుంటూరు కారంలో మహేష్ ఎంట్రీ సీన్ ని త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారట. తాజా సమాచారం ప్రకారం రెడ్ కలర్ థార్ జీప్ నుంచి స్టయిల్ గా దిగుతూ మహేష్ ఎంట్రీ ఇస్తాడట. మహేష్ ఎంట్రీ తో ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ అని చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గానే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది.

త్రివిక్రమ్ గత సినిమాలకి భిన్నంగా 'గుంటూరు కారం' ఉంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమా అంతా మంచి మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ తో పాటూ హై ఎమోషనల్ సీన్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News