'గుంటూరు కారం'.. ఫుల్ స్వింగ్ లో ఓవర్సీస్ బుకింగ్స్!

గుంటూరు కారం ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందే వన్ మిలియన్ మార్క్ దాటిన రీజనల్ సినిమాగా నిలిచింది. అతి త్వరలోనే 1.5 మిలియన్ మార్క్ ని కూడా అందుకోవచ్చు అని అంటున్నారు.

Update: 2024-01-03 12:45 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.

మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నట్లు తాజా సమాచారం. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ 150k డాలర్లు దాటాయి. ఇక ప్రస్తుతం బుకింగ్ ట్రెండ్ ప్రకారం.. గుంటూరు కారం ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందే వన్ మిలియన్ మార్క్ దాటిన రీజనల్ సినిమాగా నిలిచింది. అతి త్వరలోనే 1.5 మిలియన్ మార్క్ ని కూడా అందుకోవచ్చు అని అంటున్నారు.

అటు యూకే లో 31 లోకేషన్లలో బుకింగ్ ఓపెన్‌ అయింది. దాదాపు 52 షోల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దాదాపు 7500 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ గణాంకాలు మహేష్ గత చిత్రం సర్కారు వారి పాట ప్రీమియర్ నెంబర్స్ ని అధిగమించడం విశేషం. ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాల్లో కూడా బుకింగ్స్ మరింత స్ట్రాంగ్ గా ఉన్నట్లు సమాచారం.

ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే కేవలం ఓవర్సీస్ లోనే గుంటూరు కారం రూ.25 కోట్ల ఓపెనింగ్ తో ప్రారంభమవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. అటు త్రివిక్రమ్ సినిమాలు కూడా ఓవర్సీస్ మార్కెట్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇద్దరూ ఓవర్సీస్ లో పెద్ద స్టార్లే. కాబట్టి కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న గుంటూరు కారం ఓవర్సీస్ లో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ సాధిస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు.

ఇక గుంటూరు కారం ట్రైలర్ కనుక ఆడియన్స్ ని ఆకట్టుకుంటే సినిమాకు అన్నిచోట్ల భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News