హనుమాన్ డే 1 బాక్సాఫీస్.. బ్లాస్ట్ అయ్యిందిగా..
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా బలమైన పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి లో తక్కువ ధియేటర్లలో విడుదలయింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా బలమైన పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి లో తక్కువ ధియేటర్లలో విడుదలయింది. ఇక విడుదల కంటే ఒకరోజు ముందుగానే రిస్కు చేసి మరి ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. అయితే చిత్ర యూనిట్ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీమియర్ షో లతో మంచి గుర్తింపు అందుకుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో అలాగే మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను గట్టిగానే విడుదల చేశారు.
ఇక సినిమా పాజిటివ్ టాక్ కు తగ్గట్టుగా కలెక్షన్స్ పెంచుకుంటూ వెళుతుంది. ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమాకు దాదాపు 2 కోట్ల 50 లక్షల షేర్ కలక్షన్స్ అయితే వచ్చాయి. ఇక ఆ మరుసటి రోజు, అంటే విడుదలైన మొదటి రోజు సినిమా మరింత దూకుడుగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో దాదాపు 3.66 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఉత్తరాంధ్ర గుంటూరు కృష్ణ వంటి ఏరియాలలో కూడా సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే హనుమాన్ సినిమా 7.97 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఉదయం థియేటర్స్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈవినింగ్ సమయానికి థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళింది.
ఇక కర్ణాటకలో ఈ సినిమాకు కోటికి పైగానే షేర్ కలెక్షన్స్ రావడం విశేషం. అక్కడ పెద్దగా బజ్ లేకపోయినప్పటికీ మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో సాయంత్రం షోలకు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక హిందీలో అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా చూసుకుంటే మొదటిరోజు కోటికి పైగానే షేర్ కలక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సినిమా 3.55 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13.77 కలెక్షన్స్ 24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓవరాల్ గా చేసిన థియేట్రికల్ బిజినెస్ 29.65 కోట్లు అంటే బాక్సాఫీస్ వద్ద సినిమా మినిమం 31 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఇంకా ఈ సినిమా టార్గెట్ ఫినిష్ చేయడానికి 17 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వెనక్కి తీసుకురావాలి. చూస్తుంటే ఈ టార్గెట్ ను ఈ వీకెండ్ లోనే ఫినిష్ చేసేలా కనిపిస్తోంది. చూడాలి మరి నార్త్ సైడు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో.
హనుమాన్ ఫస్ట్ డే షేర్ కలెక్షన్స్
ఏపీ తెలంగాణ మొత్తం:- 7.97 కోట్లు
కర్ణాటక - 1.10 కోట్లు
హిందీ+రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.15 కోట్లు
ఓవర్సీస్: 3.55 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్:- 13.77 కోట్లు
బ్రేక్ ఈవెన్ - 31 కోట్లు