హనుమాన్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వాల్సిందే..!

రామాయణ ఇతిహాసంలో ఇప్పటివరకు ఎవరు చెప్పని.. ఎవరు ప్రస్తావించని విషయాలను హనుమాన్ లో ప్రశాంత్ వర్మ చూపించాడు.

Update: 2024-01-14 05:50 GMT

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ రామాయణానికి సంబంధించిన రెండు కొత్త విషయాలను ప్రస్తావించాడు. రామాయణ ఇతిహాసంలో ఇప్పటివరకు ఎవరు చెప్పని.. ఎవరు ప్రస్తావించని విషయాలను హనుమాన్ లో ప్రశాంత్ వర్మ చూపించాడు.

అందులో మొదటిది విభీషణుడి రాజ్య పాలనలో హనుమ సలహాదారునిగా ఉన్నాడని చెప్పడమే.. వాల్మీకి రామాయణంలో అసలు ఈ ప్రస్తావన లేదు. ఇది కచ్చితంగా ప్రశాంత్ వర్మ చెప్పిన కొత్త విషయం. ఇదే కాదు రామాయణాన్ని వేల సార్లు చదివిన ప్రవచించిన వారు కూడా ఈ విషయాన్ని సమర్ధించ లేకపోతున్నారు. రావణ సభలో దూతగా వచ్చిన వారిని సమ్హరించకూడదని విభీషణుడు సలహా ఇవ్వడం.. రాముని దగ్గరకు వచ్చి శరణు కోరిన విభీషణుడికి హనుమ కూడా శరణు కోరిన వారిని ఆశ్రయం ఇవ్వడం ధర్మమని చెప్పడం తెలిసిందే. కానీ విభీషణుడి రాజ్యంలో హనుమ సలహాదారులు అనేది కొత్తగా ఉంది.

ఇక మరో అంశం.. శ్రీరామునికి హనూ ఇచ్చిన మాట ఏంటి.. హనుమాన్ 2 అదే జై హనుమాన్ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశాడు ప్రశాంత్ వర్మ. హనుమ రామునికి ఏం మాట ఇచ్చాడు. అసలు ఇది కూడా ఎక్కడ ప్రచారంలో లేనిదే. వాల్మీకి రామాయణంలో కూడా ఇలాంటి ఘట్టం ఏమి లేదని పండితులు చెబుతున్నారు. శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత రామాయణం పూర్తయిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉత్తరకాండని వాల్మీకి రాయలేదని కొందరు చెబుతుంటారు. అయితే ఉత్తరాకాండలో కూడా ఇలాంటివేవి లేవని ఇది ప్రశాంత్ వర్మ ఎక్కడ నుంచి తెలుసుకున్నాడో క్లారిటీ ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇతిహాసాల మీద మంచి పట్టు ఉన్న ప్రశాంత్ వర్మ ఈ రెండు అంశాలు ఎక్కడ నుంచి తీసుకున్నాడో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

రామాయణం ఆధారంగా చాలా కథలు వచ్చాయి. సప్త చిరంజీవులనే ఒక పురాణం ఉంది. అందులో హనుమ విభీషణుడు కూడా ఉన్నారు. ఒకవేళ అందులో ఏదైనా ప్రశాంత్ వర్మ ఈ అంశాలను తీసుకుని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పురణాల మీద సినిమాలు చేసేప్పుడు అక్కడ లేనిది తీస్తే చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే హనుమాన్ 2 గా చేస్తున్న జై హనుమాన్ సినిమాలో వీటిపై ప్రశాంత్ వర్మ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


Tags:    

Similar News