మా సినిమాని కావాలనే తొక్కేస్తున్నారు : 'హనుమాన్' నిర్మాత

తాజాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి స్పందిస్తూ..' తమ సినిమాని కావాలనే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-01-04 13:36 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో 'హనుమాన్' కూడా ఒకటి. యంగ్ హీరో తేజ సజ్జా టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్ లో భారీ రెస్పాన్స్ అందుకుని ఈరోజు సంక్రాంతి సినిమాలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. మిగతా సినిమాలతో పోల్చుకుంటే 'హనుమాన్' చిన్న హీరో సినిమా కావడంతో ఈ మూవీకి పెద్దగా థియేటర్స్ దొరకడం లేదు.


అందుకు కారణం ఈ సినిమా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుండడమే. గుంటూరు కారం, హనుమాన్ రెండు సినిమాలు జనవరి 12నే రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో 'గుంటూరు కారం' దాదాపు 90% థియేటర్స్ ని ఆక్యుపై చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే 'హనుమాన్' కి కనీసం ఒకటి, రెండు థియేటర్స్ కూడా దొరకడం లేదు. దీన్ని బట్టి హనుమాన్ సినిమాని ఎంతలా టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటిదాకా హనుమాన్ పై జరుగుతున్న అన్యాయం చూసి మౌనంగా ఉండిపోయిన టీం ఇప్పుడిప్పుడే రెస్పాండ్ అవుతోంది. తాజాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి స్పందిస్తూ..' తమ సినిమాని కావాలనే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో 75 సింగిల్ స్క్రీన్స్ ఉంటే కనీసం 10 కూడా హనుమాన్ కి ఇవ్వలేదని ఆయన అన్నారు.

మరో రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితి సర్దుబాటు అవుతుందనే ఆశ తనకు ఉందని, ఒకవేళ అప్పటికి థియేటర్స్ ఇవ్వకపోతే సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ వాటంతట అవే పెరుగుతాయనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అంతేకాకుండా హనుమాన్ కేవలం సంక్రాంతికి వచ్చి వెళ్లిపోయే సినిమా మాత్రం కాదని, కనీసం నాలుగైదు వారాలైన బాక్సాఫీస్ దగ్గర ఆడుతుందని, అందుకే సంక్రాంతికి తమ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాకపోయినా ఇబ్బంది లేదని' చెప్పుకొచ్చారు.

మరోవైపు నైజాం మొత్తం ఇప్పుడు దిల్ రాజు చేతుల్లోనే ఉంది. 'గుంటూరు కారం' సినిమాని నైజాంలో ఆయనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నైజాంలో ఉన్న అన్ని థియేటర్స్ లో తన సినిమానే ముందు పడాలనేది దిల్ రాజు ఆలోచన. ఈ కారణం తోనే 'హనుమాన్' కి థియేటర్స్ ఎక్కువగా దొరకడం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News