'హనుమాన్'.. ఆ విషయంలో మేకర్స్ రిస్క్ చేస్తున్నారా?

బేసిగ్గా హనుమాన్ తెలుగు మూవీ కాబట్టి హిందీలో ఒక్కసారే 1500 ధియేటర్స్ అంటే మూవీ టీమ్ రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి.

Update: 2023-12-19 09:57 GMT

టాలీవుడ్ లో అ!, జాంబిరెడ్డి వంటి సినిమాలతో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ అతి త్వరలోనే 'హనుమాన్' అనే సూపర్ విజువల్ వండర్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. యంగ్ హీరో తేజ సజ్జ ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జాంబిరెడ్డి' మంచి సక్సెస్ అందుకోవడంతో 'హనుమాన్' పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తేజ సజ్జ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ టీం ఈరోజు ట్రైలర్ ని విడుదల చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆదుకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన విఎఫ్ఎక్స్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో సినిమాపై హైప్ కూడా పెరిగిపోయింది.

ఇలాంటి తరుణంలో మూవీ టీం సినిమాని ప్రపంచవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం గురించి టైలర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.." సినిమాని సంక్రాంతికి వీళ్ళని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. తెలుగులో దాదాపు 400 థియేటర్స్ లో అలాగే హిందీలో 1500 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చాడు.

ఓ చిన్న సినిమా ఫస్ట్ టైం హిందీలో 1500 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే మామూలు విషయం కాదు. బేసిగ్గా హనుమాన్ తెలుగు మూవీ కాబట్టి హిందీలో ఒక్కసారే 1500 ధియేటర్స్ అంటే మూవీ టీమ్ రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. గతంలో 'కార్తికేయ 2' సినిమా విషయంలో మేకర్స్ మొదట హిందీలో 50 థియేటర్ల కంటే ఎక్కువ రిస్క్ చేయలేదు.

సినిమా రెస్పాన్స్ ని బట్టి మెలమెల్లగా పెంచుకుంటూ వెళ్లారు. అది బాగా ప్లస్ అయింది. కానీ 'హనుమాన్' మాత్రం ఒకేసారి హిందీలో 1500 థియేటర్స్ అంటున్నారు. ఒకవేళ రిలీజ్ తర్వాత టాక్ తేడా వస్తే మొదటికే మోసం వస్తుందని పలురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి హనుమాన్ రిలీజ్ తర్వాత హిందీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News