నటాషాకు పాండ్యా ఫ్యాన్స్ క్షమాపణలు
ప్రేమించి పెళ్లాడిన భార్య నుంచి హార్థిక్ పాండ్యా విడిపోతున్నట్టు ప్రకటించగానే అభిమానులు షాక్ తిన్నారు
ప్రేమించి పెళ్లాడిన భార్య నుంచి హార్థిక్ పాండ్యా విడిపోతున్నట్టు ప్రకటించగానే అభిమానులు షాక్ తిన్నారు. ఈ అందమైన జంట బ్రేకప్ అవ్వాల్సినంత తీవ్ర సమస్య ఏం వచ్చింది? అంటూ ఆరాలు తీసారు. కలతలు ఉన్నా విడిపోయేంత పెద్ద గొడవలా? అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఆవేశంలో అలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా కొందరు భావించారు.
కారణం ఏదైనా కానీ, గత జూలైలో నటాసా స్టాంకోవిక్- హార్దిక్ పాండ్యా విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు నెటిజనుల్లో ఒక వర్గం నటాషాను నిందించింది. ఆమె క్రికెటర్ పాండ్యా జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. నటాషా సోషల్ మీడియాలో ప్రతికూలతను ఎదుర్కొంది. క్రూరంగా ట్రోలింగుకి గురైంది. కానీ ఇంతలోనే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ పుకార్లు ముఖ్యాంశాలుగా మారిన కొన్ని గంటల తర్వాత పెద్ద సంఖ్యలో పాండ్యా అభిమానులు, ఇతర నెటిజన్లు నటాషాకు క్షమాపణలు చెప్పారు.
క్షమించండి నటాషా.. పూర్తి కథ తెలియకుండా మేము మిమ్మల్ని నిందించాము. మీరు మంచి అర్హులు.. అని ఒక నెటిజన్ రాసారు. హార్దిక్ ప్రసిద్ధ క్రికెటర్, సంపన్నుడు అయినందున నటాషా నిందకు అర్హుడు కాదని భావించలేం! అని మరొకరు జోడించారు. ఏ స్త్రీ సంబంధంలో ఎలాంటి నొప్పిని కోరుకోదు. హార్దిక్ గొప్ప క్రికెట్ ఆటగాడు కావచ్చు.. కానీ అది అతడిని మంచి భర్తగా మార్చదు! అని మరొకరు రాసారు. ఆమెను దుర్భాషలాడే వారు, ఆమె అతడిని ఎందుకు విడిచిపెట్టిందో ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఎప్పుడూ ఒక వైపు కథ వినకండి... హార్దిక్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడు! అని మరొక వ్యక్తి రాశాడు.
నటాషా అభిమాని ఒకరు తనకు మద్దతుగా ఒక పెద్ద నోట్ రాసారు. ``భార్య నెటిజనుల ట్రోలింగుతో ఇబ్బంది పడింది. ప్రస్తుతానికి తన కొడుకును రక్షించుకుంటుంది. ఇంతలోనే మాజీ భర్త తన కొత్త భాగస్వామితో కలిసి విహారయాత్రను ఆస్వాధిస్తున్నాడు.. విడిపోవడానికి కారణాలు బలంగా ఉన్నాయి. ఎవరైనా ఇతరుల భావాలు, శ్రేయస్సు గురించి జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యమైనది.. అని రాసారు.
హార్దిక్ - జాస్మిన్ డేటింగ్ జీవితానికి సంబంధించి ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఆ ఇద్దరూ ఒకే పూల్ వద్ద నిలుచున్న వేర్వేరు ఫోటోలను షేర్ చేసారు. నేపథ్యంలో గ్రీక్ ల్యాండ్‌స్కేప్ ఉంది. ఒకే చోటి నుంచి ఆ ఇద్దరి ఫోటోలు బయటకు రావడంతో అన్ని సందేహాలకు జవాబు దొరికినట్టయింది.
మే 2020లో పెళ్లి చేసుకున్న నటాసా స్టాంకోవిక్ - హార్దిక్ పాండ్యా ఫిబ్రవరి 2023లో హిందూ, క్రిస్టియన్ ఆచారాల ప్రకారం తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. జూలై 2024లో బ్రేకప్ ని ధృవీకరించారు. వారు తమ కుమరుడికి సహ తల్లిదండ్రులుగా ఉన్నారు.