వీరమల్లు.. సైలెంట్ గా ఉంటే ఎలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-28 04:29 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఆ సినిమా షూటింగ్.. అనేక కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పవన్ బిజీగా ఉండటం వల్ల హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పవన్ అటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ఇటు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నారు.

హరిహర వీరమల్లు ప్రాజెక్టుకే ఫస్ట్ డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో వేసిన సెట్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి కల్లా షూటింగ్ కంప్లీట్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత పవన్.. ఓజీ సెట్స్ లో అడుగు పెడతారని సమాచారం. అయితే వీరమల్లు.. పవన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం.. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ పాడినట్లు వార్తలు వస్తున్నాయి. జానపద యాసలో ఆ పాట ఉండనున్నట్లు సమాచారం. దీపావళి కానుకగా సాంగ్ విడుదల చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

కానీ మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు సాంగ్ రిలీజ్ ఉందా లేదా అని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా అని క్వశ్చన్ చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుంది కనుక, వరుస అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. సాంగ్ ఉంటున్నట్లు బజ్ వస్తున్నా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో మేకర్స్ ను అడుగుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా మిగిలిన పోర్షన్ కు ఇప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నారు. మరి ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ ఎప్పుడు విడుదల చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News