ఉస్తాద్ భగత్ సింగ్.. ఇది అసలు మ్యాటర్!

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు

Update: 2024-08-07 09:19 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పాలిటిక్స్ లోకి వెళ్లిన అనంతరం సినిమాలకు సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యం అభిమానుల‌లో భారీ అంచ‌నాలు క్రియేట్ చేస్తుంది. సినిమాల‌కు కాస్త విరామం ఇచ్చి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని సాధించిన త‌ర్వాత, ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన అన్ని సినిమా ప్రాజెక్టులు ఆగిపోయాయి.

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అన్ని ప్రాజెక్టుల నిర్మాత‌ల‌తో స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ ప్రైవేట్ మీటింగ్‌లో ఆయ‌న త‌న ప్ర‌స్తుతం ఉన్న ప్రాజెక్టుల‌న్నీ త్వ‌ర‌లోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మొద‌టగా, ఆయ‌న ‘OG’ షూట్‌ను తిరిగి ప్రారంభించి, అక్టోబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నారు.

మరోవైపు హ‌రీష్ శంక‌ర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో రెండోసారి తెర‌కెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’. ఇటీవ‌లే ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పాలిటిక్స్ లో చాలా బిజీ అయ్యారు. అలాగే నేను మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీగా ఉన్నాను.

ప‌వ‌న్ గారు సినిమాలకు తిరిగి వచ్చిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ప్రారంభం అవుతుంది. OG, హరి హర వీర మల్లు చిత్రాలను త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటివరకు 20 శాతం మాత్రమే ఫినిష్ అయ్యింది. మిగిలిన భాగం త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతుంది.. అని హ‌రీష్ శంక‌ర్ తెలిపారు. అంటే వీరి ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాదిలోనే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇక హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ విడుదల అనంతరం కొంత గ్యాప్ ఉండడంతో మరో ప్రాజెక్టును లాక్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలతో కథలపై చర్చలు కూడా జరిపారు. రామ్ పోతినేని తో కూడా ఒక సినిమా అనుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకే వివరణ ఇచ్చారు. లైన్ లో మరికొందరు హీరోలు ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ అనంతరం వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News