మిస్టర్ బచ్చన్.. అప్పుడు మాట్లాడుకుందాం బ్రో: హరీష్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 18 ఏళ్లు దాటిపోయింది

Update: 2024-07-22 13:13 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 18 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకు ఆయన ఏడు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2006లో షాక్ మూవీతో డైరెక్టర్ గా హరీష్ మారారు. రవితేజ హీరోగా వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఐదేళ్ల గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ రవితేజతోనే తన రెండో సినిమా మిరపకాయ్ చేసి సూపర్ హిట్ ను సాధించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.

పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా మూవీ చేసి నిరాశపరిచారు హరీష్. సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం సినిమాలు పర్లేదనిపించాయి. వరుణ్ తేజ్ తో చేసిన గద్దలకొండ గణేష్ 2019లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. ఆ సినిమా వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. ఆయన నుంచి ఇప్పటి వరకు మరో మూవీ రాలేదు. మధ్యలో పవన్ తో మూవీని స్టార్ట్ చేశారు.

కానీ ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ హోల్డ్ లోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను అనౌన్స్ చేశారు హరీష్ శంకర్. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అంతకుముందు హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ చిత్రాలు కూడా రీమేక్సే. దీంతో తాజాగా ఓ నెటిజన్.. హరీష్ శంకర్ కు రిక్వెస్ట్ ట్వీట్ పెట్టాడు. "మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సర్.. ఇదే మీ నుంచి వచ్చే చివరి రీమేక్ అవ్వాలి. మీ రైటింగ్స్ తో మీరు సొంతంగా మ్యాజిక్ చేయవచ్చు. మిరపకాయ్, షాక్ ఇంకా నా మైండ్ లో తిరుగుతున్నాయి. బ్యాంగర్(భారీ హిట్)తో కమ్ బ్యాక్. మిస్టర్ బచ్చన్ కు ఆల్ ది బెస్ట్" అంటూ రాసుకొచ్చాడు.

దీంతో వెంటనే హరీష్ స్పందించారు. "ఇది(మిస్టర్ బచ్చన్) చూసి నువ్వు రీమేక్ అని ఫీల్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో. నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీ డైరెక్టర్. ఎప్పుడైనా నాతో కమ్యూనికేట్ అవ్వొచ్చు" అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం హరీష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీపై ఫుల్ నమ్మకంతో ఆయన ఉన్నట్లు తెలుస్తుందని అంటున్నారు నెటిజన్లు. మరి అనేక ఏళ్ల తర్వాత హరీష్, రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News