హీరోయిన్‌ కిక్స్‌ నిజం.. దెబ్బలు నిజం.. కన్నీళ్లు నిజం

హీరోయిన్స్‌ అంటే చాలా సుకుమారంగం, కష్టం అంటే తెలియకుండా అందాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ మేకప్‌ వేసుకుని ఉంటారు అనుకుంటారు.

Update: 2023-12-04 17:30 GMT

హీరోయిన్స్‌ అంటే చాలా సుకుమారంగం, కష్టం అంటే తెలియకుండా అందాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ మేకప్‌ వేసుకుని ఉంటారు అనుకుంటారు. కానీ కొందరు హీరోయిన్స్‌ మాత్రం అందకు విరుద్దంగా ఉంటారు. తమకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు.. ఎంత కష్టానికి అయినా సిద్ధం అంటారు.


ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మధ్య ఉన్న పోటీ నేపథ్యం లో చాలా మంది హీరోయిన్స్‌ ఆ తరహా కష్టాన్ని ప్రదర్శించేందుకు సిద్దం అవుతున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లో హీరోయిన్స్ అంటే ఒకప్పుడు ఎక్కువగా డూప్స్ వాడేవారు. కానీ ఇప్పుడు డూప్‌ లేకుండా రియల్‌ గానే స్టంట్స్‌ చేస్తున్నారు. స్టంట్స్‌ చేస్తూ కష్టపడే హీరోయిన్స్ జాబితాలో కళ్యాణి ప్రిదర్శన్‌ చేరారు.


స్టార్‌ కిడ్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లను అందుకోలేక పోయింది. అయితే ప్రయత్నాలు వదలకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. తాజాగా ఆంటోనీ సినిమాతో మలయాళం ప్రేక్షకుల ముందుకు కళ్యాణి ప్రియదర్శిని వచ్చింది.


ఆ సినిమా కోసం కళ్యాణి ఏ స్థాయిలో కష్టపడిందో సినిమా చూస్తే అర్థం అవుతుంది. తాజాగా సోషల్‌ మీడియా ద్వారా కళ్యాణి తన కష్టంకు సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేసింది. బాక్సింగ్‌ ప్రాక్టీస్ సందర్భంగా నిజమైన కిక్స్ తిన్నాను.. నా ఒంటి మీద ఉన్నవి నిజమైన దెబ్బలు, నా కంటి నుండి వచ్చిన నీళ్లు నిజమైన కన్నీళ్లు అంటూ కళ్యాణి సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.


మొత్తానికి కళ్యాణి హీరోయిన్‌ గా తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు సాధ్యం అయినంత కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చింది. ముందు ముందు కూడా ఇలాంటి పాత్రలు అప్పగిస్తే సిద్దం అన్నట్లుగా కళ్యాణి ఈ పోస్ట్‌ ద్వారా చెప్పకనే చెబుతుంది అనిపిస్తోంది.

Tags:    

Similar News