డీప్ పేక్ దందా..హీరోల గుండెల్లో రైళ్లు!
అది వైరల్ గా మారింది. చూసిన వారంతా ఆ పనిచేసింది అమీర్ ఖానా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు
డీప్ పేక్ వీడియోలు సెలబ్రిటీల పాలి శాపంగా మారిన సంగతి తెలిసిందే. పేక్ వీడియోలతో సెలబ్రిటీల్ని మార్కెట్ లో డీగ్రేడ్ చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హీరోయిన్ల పేరుతో అశ్లీల వీడియోలు రిలీజ్ చేసి సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే తాజాగా దేశంలో ఎన్నికల హడావుడిని ఎన్ క్యాష్ చేసుకునేది మరికొంత మంది. ఇటీవలే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఓ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి నెట్టింట వదిలారు.
అది వైరల్ గా మారింది. చూసిన వారంతా ఆ పనిచేసింది అమీర్ ఖానా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. అత నేచురల్ గా ఆ వీడియో ఉంది. దీంతో అదంతా అవాస్తవమంటూ..ఏపార్టీ తరుపున తాను ప్రచారం చేయలేదని అమీర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రణవీర్ సింగ్ కూడా డీప్ పేక్ బారిన పడ్డాడు. అతడు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సరిగ్గా రణవీర్ సింగ్ వారణాసిలో పర్యటించిన వీడియోనే పేక్ ఐడీతో క్రియేట్ చేసి జనాల్లోకి వదలడంతో అది సంచలనంగా మారింది.
దీంతో రణవీర్ అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. అదంతా తప్పుడు ప్రచారమంటూ ఖండించారు. దీంతో హీరోలంతా దీన్ని కొత్త రకం వైరస్ గా పరిగణిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు ఇంకెంత మంది హీరోలు డీప్ పేక్ బారిన పడతామో అంటూ టెన్షన్ పడుతున్నారు. మార్కెట్ లో డీప్ పేక్ అనేది ఓ దందాగా తయారైంది. ఏఐ టెక్నాలజీతో ఇష్టారీతున వీడియోలు చేయడం..స్వలాభం కోసం వాటిని మార్కెట్ లోరిలీజ్ చేసి చెడు అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నాన్ని అన్ని పరిశ్రమల హీరోలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే రష్మిక మంద న్నపై డీప్ పేక్ చేసిన వాడిని అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. మూలాలు సమూలంగా నాశనం చేసేలా సైబర్ క్రైమ్ కృషి చేస్తుంది. అయినా డీప్ పేక్ జోరు మాత్రం ఆగడం లేదు. సెలబ్రిటీల పేరుతో రోజుకొక వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇక పొలిటికల్ కోణంలో చూస్తే దేశంలో ఉన్న అన్నీ పార్టీలు ప్రత్యర్ది వర్గంపై ఇలాంటి వీడియెలు రిలీజ్ చేస్తూనే ఉన్నాయి.