బిజినెస్ రంగంలో హీరోయిన్ పెట్టుబడులు
ముంబైలో జరిగిన లాంచింగ్ ఈవెంట్ కి సంబంధించిన కొత్త దుస్తులు చీరల డిజైన్లను అభిమానులతో షేర్ చేసుకుంది.
`చక్ దే ఇండియా` సినిమాతో నటి సాగరిక ఘట్గే కి గొప్ప పాపులారిటీ దక్కింది. ఆ సినిమా వల్లనే సాగరికను చక్ దే గర్ల్ అని పిలుస్తారు. సాగరిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీని ద్వారా అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉంది. సాగరిక 2017లో క్రికెటర్ జహీర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత కొంత కాలం సినీ పరిశ్రమకు విరామం ఇచ్చిన సాగరిక ఇప్పుడు తన కొత్త వ్యాపారాన్ని ప్రకటించింది. ఆమె దుస్తుల వ్యాపారంలో ప్రవేశించింది.
నటి సాగరికా ఘట్గే ఇటీవల కొత్త దుస్తుల బ్రాండ్‌ను విడుదల చేశారు. `అకూతి` అనేది సాగరిక ప్రారంభించిన కొత్త దుస్తుల బ్రాండ్ పేరు. ముంబైలో జరిగిన లాంచింగ్ ఈవెంట్ కి సంబంధించిన కొత్త దుస్తులు చీరల డిజైన్లను అభిమానులతో షేర్ చేసుకుంది. సాంప్రదాయ చీరలకు ఆధునిక వెస్ట్రన్ టచ్ ఇచ్చినవి.. ఉన్నాయి. ఈ వ్యాపారంలో సాగరికకు తన తల్లి ఊర్మిళ మద్దతు లభించింది. ఈ వ్యాపారం కోసం సాగరిక భారీగా పెట్టుబడులు పెట్టిందని తెలిసింది.
సాగరిక రాజకుటుంబంలో పుట్టింది. అమ్మమ్మ సీతా రాజే ఘడ్గే ఇండోర్ మహారాజా తుకోజీరావ్ హోల్కర్ కుమార్తె. ఆమె చదువుతున్న సమయంలో సాగరికకు అనేక సినిమా ఆఫర్లతో పాటు, వాణిజ్య ప్రకటనల ఆఫర్లు రావడం ప్రారంభించాయి. కానీ సాగరిక తండ్రి సున్నితంగా తిరస్కరించారు. సాగరిక `చక్ దే ఇండియా` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2013లో వచ్చిన రష్ చిత్రంలో ఇమ్రాన్ హష్మీకి జోడీగా కనిపించింది. సాగరిక హిందీతో పాటు పంజాబీ, మరాఠీ చిత్రాల్లో కూడా నటించింది.