CBFC లంచగొండితనంపై విశాల్‌ను ప్రశ్నించిన సిబిఐ
కొద్ది రోజుల క్రితం హీరో విశాల్ సీబీఎఫ్‌సి లంచగొండితనంపై తీవ్రంగా ఆరోపించగా, దీనిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే
కొద్ది రోజుల క్రితం హీరో విశాల్ సీబీఎఫ్‌సి లంచగొండితనంపై తీవ్రంగా ఆరోపించగా, దీనిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ తీగ లాగుతోంది. తాజాగా సిఎఫ్‌బిసి లంచం ఆరోపణలపై విశాల్‌ను సిబిఐ ప్రశ్నించింది. సీబీఐతో తన భేటీ గురించి విశాల్ ఓపెన్‌గా చెప్పారు. సిబిఎఫ్‌సి లంచం కేసుకు సంబంధించి తనను విచారణకు పిలిచారని వెల్లడించాడు.
ఎవ్వర్ లేటెస్ట్ సమాచారం మేరకు.. CFBC లంచం కేసులో తమిళ నటుడు విశాల్ తన రౌండ్ CBI విచారణను పూర్తి చేసాడు. దానిపై తన మనసులో మాటను తెలిపాడు. X లో విశాల్ తాను వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని, వారిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగానని చెప్పాడు. అందులో ఒకటి సీబీఐ అధికారి డ్యూటీలో ఎలా కనిపిస్తాడు? అని కూడా అడిగాడట.
''సీబీఎఫ్‌సీ కేసుకు సంబంధించి విచారణ కోసం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి నా సందర్శన ఇప్పుడే పూర్తయింది. పూర్తి కొత్త అనుభవం.. విచారణ జరుగుతున్న తీరుకు సంతోషంగా ఉంది'' అని కూడా విశాల్ చెప్పాడు. సిబిఐ కార్యాలయం ఎలా ఉంటుందో కూడా కొన్ని ఇన్‌పుట్‌లు తీసుకున్నాను. నేను కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసుకి వెళతానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. రీల్ లైఫ్‌లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అవినీతికి వ్యతిరేకంగా నిలబడటానికి అడుగు పెట్టాలి! అని విశాల్ ధైర్యం చూపారు.
సెప్టెంబరులో విశాల్ తన తాజా చిత్రం మార్క్ ఆంటోని హిందీ వెర్షన్‌ను విడుదల చేయడానికి 6.5 లక్షల రూపాయల విలువైన లంచం ఇవ్వాలని CBFC నుండి ఒక మధ్యవర్తి తనను కోరినట్లు ఆరోపించాడు. ఎక్స్‌లో తన పోస్ట్‌లో అతడు స్క్రీనింగ్ కోసం రూ. 3 లక్షలు, వెనక బెంచీ నుంచి 3.5 లక్షలు లావాదేవీ ద్వారా చెల్లించాకే U/A సర్టిఫికేట్ వచ్చిందని తెలిపాడు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
నేను రూ. 6.5 లక్షలు చెల్లించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి నా సినిమా విడుదల చాలా ప్రమాదంలో ఉంది. నిజం బయటకు రావడానికి నేను చెల్లించిన మూల్యం అది. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. నా కెరీర్‌లో ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదు. వెండితెరపై మాత్రమే అవినీతికి వ్యతిరేకంగా పోరాడలేను. నేను నిజ జీవితంలో అవినీతిని చూశాను. అది కూడా ప్రభుత్వ కార్యాలయంలో. వారికి సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సమర్థించుకోవడానికి వారు నిర్మాతల నుండి డబ్బు తీసుకోలేరు. నేను అడల్ట్ లేదా పోర్న్ ఫిల్మ్ చేయడం లేదు. నేను ఇప్పటికే సౌత్ ఇండియాలో సర్టిఫికేట్ పొంది విడుదలైన సినిమా కోసం దరఖాస్తు చేస్తున్నాను. బహుశా నేను ఆలస్యంగా అక్కడికి వెళ్లాను. అయితే సర్టిఫికేట్ కోసం రూ.6.5 లక్షలు? అడిగారు. రూ. 6.5 లక్షలు అకస్మాత్తుగా చెల్లించడానికి మేము చాలా కష్టపడ్డాము. ఒక చిన్న నిర్మాత ఇలాంటి సమయంలో ఏం చేస్తాడో ఊహించండి? నాకు బాలీవుడ్ గురించి తెలియదు కానీ దక్షిణ భారతదేశంలో ఈ విషయాలు అస్సలు లేవు! అని విశాల్ అన్నాడు.