అన్నీ ఉన్నా ఏం చేయలేకపోతున్న హీరో తమ్ముడు!
వాటిలో విజయాలు కన్నా పరాజయాలే ఎక్కువ. అందులోనూ వాటన్నింటిని గ్యాప్ తీసు కుని మరీ ఎంచుకుని చేసినా సినిమాలు.
అన్నీ ఉన్నాయి..కోట్ల ఆస్తీ..ఖరీదైన కార్లు..లగ్జరీ లైఫ్ స్టైల్..అభిమానించే హీరోలు..కోట్ల రూపాయాలు పెట్టుబడి పెట్టే నాన్న.. ముందుకొచ్చి భుజాలపై నడిపించే అన్నయ్య అంతా ఉన్నారు. ఏ రకంగానూ అతనికి ఎలాంటి ఢోకా లేదు. నేను రెడీ అంటే చాలు అంతా రంగంలోకి దిగిపోతారు. ప్రారంభమైన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకూ అన్ని ముందుండి నడింపించేస్తారు. కానీ ఆ హీరో మాత్రం ఏం చేయలేకపో తున్నాడు.
కెరీర్ పరంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఆరేడు సినిమాలు చేసి ఉండొచ్చు. వాటిలో విజయాలు కన్నా పరాజయాలే ఎక్కువ. అందులోనూ వాటన్నింటిని గ్యాప్ తీసు కుని మరీ ఎంచుకుని చేసినా సినిమాలు. అవే ప్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ గత ఏడాది కూడా ఖాళీగా నే ఉన్నాడు. ఎలాంటి సినిమా ప్రకటించలేదు. కొత్త ఏడాది మొదటి నెల పూర్తయినా ఇంతవరకూ ఇలాంటి అప్ డేట్ కూడా లేదు.
దీంతో ఆహీరో ఇంకా స్టోరీ సెర్చ్ పనుల్లోనే ఉన్నాడా? లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలోకి బిజీ అవుతాడా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆ నటుడు నాకు అన్నీ ఉన్నాయి. లేనిదంటూ ఏదీ లేదు. నేను కొత్తగా సాధించాల్సింది అంటూ ఏమీ లేదు. అన్నీ వాళ్లిద్దరు ఇచ్చేసారు. ఈ జన్మకు ఇది చాలు అనేసాడు. ఇప్పుడు ఆ మాటనే ప్రామాణికంగా తీసుకుని సినిమాలకు దూరమవుతన్నాడా? అన్న వార్త తెరపైకి వస్తోంది.
ఓ రకంగా అతడిపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో తెరపైకి వచ్చింది. మరి వీటన్నింటిని పటాపంచల్ చేసి ఆ నటుడు మ్యాకప్ తో దూసుకొస్తే అన్ని తొలగిపోతాయి. ఒక్క హిట్ పడితే! అతడి వేగాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు.