హాయ్ నాన్న'.. నాని మరో మిలియన్ మార్క్!

ఓవర్సీస్ లో నాచురల్ స్టార్ నాని క్రేజ్ మరోసారి రుజువైంది. నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వకుండానే వన్ మిలియన్ క్లబ్ లో చేరిపోయింది.

Update: 2023-12-10 11:03 GMT

ఓవర్సీస్ లో నాచురల్ స్టార్ నాని క్రేజ్ మరోసారి రుజువైంది. నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వకుండానే వన్ మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను అందుకోవడం విశేషం. హాయ్ నాన్న కంటే ముందు ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, MCA, నిన్ను కోరి, జెర్సీ, అంటే సుందరానికి, దసరా సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా ఆ లిస్టులో హాయ్ నాన్న కూడా చేరింది.

టైర్ 2 హీరోల్లో ఎక్కువసార్లు ఈ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా నాని నిలిచాడు. ఎలాగో లాంగ్ రన్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఈజీగా టూ మిలియన్ మార్క్ కొట్టొచ్చని అంటున్నారు. ఓవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత నాని ఆ ప్లేస్ ను కైవసం చేసుకున్నాడు మహేష్ బాబు. మహేష్ ఖాతాలో ఇప్పటిదాకా 11 మిలియన్ మూవీస్ ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కాబోయే 'గుంటూరు కారం' 12వ మూవీ అవుతుంది.

ఇక మిగిలిన హీరోలు మహేష్, నాని తర్వాతి స్థానంలో ఉన్నారు. దీన్నిబట్టి ఓవర్సీస్ లో నానికి ఎంత బలమైన మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే హాయ్ నాన్న రిలీజ్ రోజే నాని అమెరికా ప్రయాణం పెట్టుకుని దానికి తగ్గట్టే అక్కడి ఆడియన్స్ ని కలుస్తూ, థియేటర్స్ విజిట్ చేస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు. సలార్ వచ్చేదాకా ఓవర్సీస్ లో హాయ్ నాన్నకు ఎలాంటి బ్రేకులు ఉండవు.

ఓవర్సీస్ లోనే కాదు ఇండియా వైడ్ గా హాయ్ నాన్న మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈసారి వీకెండ్ మూడు రోజులు ఉండడంతో హాయ్ నాన్నకు అది మరింత ప్లస్ గా మారింది. నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో తక్కువ థియేటర్స్ దక్కడం, యానిమల్ సెకండ్ వీక్ వల్ల హాయ్ నాన్న కి సరిపడా షోలు దొరకడం లేదు. అందుకే. నిర్మాతలు ఆ దిశగా ఆదివారం షోలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాదు లాంటి చోట్ల దాదాపు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అన్ని టికెట్లు అమ్ముడవుతున్నాయి. సోమవారం నుంచి ఎంతవరకు డ్రాప్ ఉంటుంది అనే విషయాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. దసరా తర్వాత హాయ్ నాన్న తో నాని మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు తగ్గట్లు థియేటర్స్ కూడా పెంచితే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News